Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

ఈ నెల 31 నుంచి పార్లమెంటు సమావేశాలు

వేర్వేరు సమయాల్లో జరుగనున్న ఉభయ సభలు
పార్లమెంటు సమావేశాలు ఈ నెల 31వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. పార్లమెంటు బడ్జెట్‌ సెషన్‌ లో కరోనా తీవ్రత కారణంగా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. . లోక్‌సభ, రాజ్యసభ సమావేశలాలను విడివిడిగా నిర్వహించాలని నిర్ణయించింది. . ఒకేసారి ఉభయ సభలు సమావేశమైతే కరోనా తీవ్రత పెరిగే అవకాశముందని భావించిన కేంద్ర ప్రభుత్వం వేర్వేరు సమయాల్లో ఉభయ సభలు ఐదు గంటలపాటు సమావేశమవుతాయి. కేంద్ర బడ్జెట్‌ను సమర్పించేందుకు ఫిబ్రవరి 1న ఉదయం 11 గంటలకు లోక్‌సభ సమావేశం కానుంది. సెషన్‌ మొదటి భాగం ముగిసే ఫిబ్రవరి 2 నుండి ఫిబ్రవరి 11 వరకు సాయంత్రం 4 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు సమావేశం జరుగుతుంది. ఈ మేరకు లోక్‌ సభ సచివాలయం బులిటెన్‌ విడుదల చేసింది.ఒక్క ఫిబ్రవరి ఒకటో తేది బడ్జెట్‌ ప్రవేశ పెట్టాల్సి ఉన్నందున ఆరోజు లోక్‌ సభ ఉదయం పదకొండు గంటలకు సమావేశం అవుతుంది. రెండో తేదీ నుంచి సాయంత్రం నుంచి లోక్‌ సభ సమావేశాలు జరగనున్నాయి.
బడ్జెట్‌ సమావేశాల సందర్భంగా రాష్ట్రపతి ప్రసంగాన్ని కూడా కోవిడ్‌ నిబంధనల మధ్య ఏర్పాట్లు చేస్తున్నారు. లోక్‌సభ, రాజ్యసభ ఛాంబర్‌లు, వాటి గ్యాలరీలను సిట్టింగ్‌ సభ్యుల కోసం ఉపయోగిస్తారని లోక్‌సభ బులెటిన్‌లో పేర్కొంది. రాజ్యసభ ఖచ్చితమైన సమయం ఇంకా అధికారికంగా తెలియజేయనప్పటికీ, ఉదయం 9 నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు ఉండవచ్చు. జనవరి 31న రాష్ట్రపతి పార్లమెంటు ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. సెషన్‌ రెండవ భాగం మార్చి 14 నుండి ఏప్రిల్‌ 8 వరకు ఉంటుంది. అయితే రెండో భాగానికి సంబంధించిన సమావేశాల సమయంపై ఇంకా స్పష్టత రాలేదు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img