Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

ఈ లక్షణాలుంటే పరీక్షలు చేయించాలి

రాష్ట్రాలకు అప్రమత్తం చేసిన కేంద్ర ప్రభుత్వం
దేశంలో కొవిడ్‌ కేసులు పెరుగుతుండటంతో కేంద్రం అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలను అప్రమత్తంచేసింది. ఈ మేరకు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలంటూ కేంద్ర వైద్య, ఆరోగ్యశాఖ కార్యదర్శి రాజేశ్‌ భూషణ్‌, ఐసీఎంఆర్‌ డైరక్టర్‌ జనరల్‌ డా.బలరామ్‌ భార్గవ్‌లు రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులకు సంయుక్తంగా లేఖ రాశారు. ర్యాపిడ్‌ యాంటిజెన్‌ పరీక్షలను విస్తృతస్థాయిలో పెంచాలని సూచించారు. ఇందుకోసం 24/7 పనిచేసే ర్యాట్‌ బూత్‌లను ఏర్పాటు చేసి, ప్రజలందరికీ అందుబాటులో తేవాలని లేఖలో పేర్కొన్నారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న మాలిక్యూలర్‌ పరీక్షల సామర్థ్యాన్ని పూర్తిస్థాయిలో వినియోగించుకోవాలని, పరీక్షలకు అవసరమయ్యే కిట్లను, ల్యాబొరేటరీ సౌకర్యాలను ఏర్పాటు చేసుకోవాలని పేర్కొన్నారు. లక్షణాలున్న వారు సొంతగా/ఇళ్ల వద్ద పరీక్షలు చేసుకునేలా ప్రోత్సహించాలని సూచించారు. ఎవరైనా జ్వరం, తలనొప్పి, గొంతునొప్పి, ఒళ్లు నొప్పులు, రుచి`వాసన కోల్పోవడం, అలసట, డయోరియా వంటి లక్షణాలతో బాధపడుతుంటే కొవిడ్‌గా అనుమానించి తప్పక పరీక్షలు జరపాలని కేంద్రం రాష్ట్రాలకు తెలిపింది. అలాంటి లక్షణాలున్న వారిని వేరుగా ఉంచాలని, ఇంటి వద్ద ఐసోలేషన్‌ మార్గదర్శకాలను పాటించేలా చర్యలు చేపట్టాలని స్పష్టంచేసింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img