Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

ఉక్రెయిన్‌పై రష్యా మిలిటరీ చర్య : ప్రకటించిన పుతిన్‌

ఉక్రెయిన్‌లో సైనిక కార్యకలాపాలు ప్రారంభమవుతాయని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ ప్రకటించారు.గురువారం ఉదయం 6 గంటల సమయంలో మాస్కోలో రష్యా అధ్యక్షుడు పుతిన్‌ మాట్లాడారు. ఇతర దేశాలు ఈ సైనిక చర్యను అడ్డుకునేందుకు ప్రయత్నిస్తే కనీవినీ ఎరుగని రీతిలో తక్షణమే తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరికలు జారీ చేశారు. తూర్పు ఉక్రెయిన్‌లోని ప్రజలను కాపాడుకునేందుకు ఈ సైనిక చర్య అత్యవసరమని ప్రకటించారు. న్యాయం రష్యా వైపు ఉందని పుతిన్‌ పేర్కొన్నారు. రష్యా ఆత్మరక్షణ కోసమే ఈ దాడి చేస్తోందని వెల్లడిరచారు.
ఉక్రెయిన్‌లోని డాన్‌బాస్‌ ప్రాంతంలో ప్రత్యేక సైనిక చర్య నిర్వహించడానికి రష్యన్‌ దళాలకు అధికారం ఇచ్చామని వ్లాదిమిర్‌ పుతిన్‌ చెప్పారు. తన పొరుగు దేశాన్ని ఆక్రమించాలనే లక్ష్యం తమకు లేదని చెప్పారు. ఉక్రయిన్‌ సైన్యంలోని వారి తండ్రులు, తాతలు ఏనాడు యుద్ధాలు చేయలేదని, అందుకే వారు నియో`నాజీలకు సహకరిస్తున్నారని ఆరోపించారు. యుద్ధరంగంలో ఉన్న ఉక్రెయిన్‌ సైనికులు ఆయుధాలను పడేసి లొంగిపోవాలని కోరారు. ఉక్రెయిన్‌ ప్రజలు తమను ఎవరు పాలించాలో ధైర్యంగా ఎంచుకోవాలని పిలుపునిచ్చారు. ఈ మేరకు ఆయన రష్యా టెలివిజన్‌ ఛానల్‌లో ప్రసంగించారు. ఉక్రెయిన్‌ నాటోలో చేరకుండా చూడాలన్న రష్యా డిమాండ్‌ను అమెరికా, దాని మిత్ర దేశాలు నిర్లక్ష్యం చేస్తున్నాయని ఆరోపించారు.
మొదలైన దాడులు :
తూర్పు ఉక్రెయిన్‌పై సైనికచర్యకు వ్లాదిమిర్‌ పుతిన్‌ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చిన వెంటనే ఉక్రెయిన్‌లోని పలుచోట్ల దాడులు మొదలయ్యాయి. ఉక్రెయిన్‌ రాజధాని కీవ్‌ నగరంపై రష్యా బాంబుల వర్షం కురిపించింది. దొనెట్స్క్‌లో ఉన్న క్రమాటోర్క్స్‌లో పేలుళ్లు వినిపించాయి. మొత్తంగా కీవ్‌, ఖర్కీవ్‌, ఒడిసా, తూర్పు దొనెట్స్క్‌లో పేలుళ్లు జరిగినట్లు సమాచారు. ఉక్రెయిన్‌ సరిహద్దుల వెంబడి సుమారు రెండు లక్షల మంది సైనికులు, ఇతర ఆయుధాలను మోహరించిన ఫోటోలు విడుదలయ్యాయి.
ప్రపంచం రష్యాను జవాబుదారీని చేస్తుంది : జో బైడెన్‌
కాగా ఉక్రెయిన్‌పై దాడి చేసినందుకు ప్రపంచం రష్యాను జవాబుదారీని చేస్తుందని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ పేర్కొన్నారు. ఈ విపత్తుతో ప్రాణనష్టం కలిగిస్తుందని హెచ్చరించారు. ఉక్రెయిన్‌లో సైనిక కార్యకలాపాలను ప్రారంభిస్తున్నట్లు పుతిన్‌ ప్రకటించిన కొద్ది సేపటికే బైడెన్‌ ఒక ప్రకటన విడుదల చేశారు. రష్యా దాడి నిష్కారణమైనది, అన్యాయమైనదిగా పేర్కొన్నారు.దేశవ్యాప్తంగా ఉక్రెయిన్‌ ప్రభుత్వం ఎమర్జెన్సీ విధించింది. అయితే రష్యా తాజా ప్రకటనపై ప్రపంచ దేశాలు షాక్‌కు గురవుతున్నాయి. రష్యా, ఉక్రెయిన్‌ దేశాల మధ్య యుద్ధం జరిగితే ప్రపంచ దేశాలకు తీవ్ర నష్టం వాటిల్లుంతుని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img