Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

ఉక్రెయిన్‌లో చిక్కుకున్న భారతీయుల కోసం రెండు విమానాలు

న్యూదిల్లీ: ఉక్రెయిన్‌లో నెలకొన్న పరిస్థితుల రీత్యా, అక్కడ చిక్కుకున్న భారతీయుల కోసం ఎయిర్‌ ఇండియా సంస్థ రోమానియన్‌ రాజధాని బుకారెస్ట్‌కు రెండు విమానాలు నడుపుతోందని ప్రభుత్వ సీనియర్‌ అధికారులు శుక్రవారం తెలిపారు. భారతీయులంతా ఉక్రెయిన్‌`రోమానియా సరిహద్దులకు చేరుకుంటే అక్కడ నుంచి అధికారులు వారిని రెండు విమానాల్లో తరలిస్తారని పేర్కొన్నారు. యుద్ధం కారణంగా ఉక్రెయిన్‌ గగతలం మూసివేయడంతో విమాన రాకపోకలకు ఇబ్బంది రీత్యా అధికారులు విమానాలను బుకారెస్ట్‌ వరకు నడుపుతున్నారు. రెండు ఏయిర్‌ ఇండియా విమానాలు శనివారం భారత్‌కు బయలుదేరతాయని వివరించారు. ఈ పరిణామాలపై స్పందించేందుకు ఎయిర్‌ ఇండియా నిరాకరించింది. సుమారు 20వేలమంది భారతీయలు, అందునా విద్యార్థులు ప్రస్తుతం ఉక్రెయిన్‌లో చిక్కుకున్నట్టు అధికారులు తెలిపారు. ఉక్రెయిన్‌ రాజధాని కైవ్‌ నుంచి రోమానియన్‌ సరిహద్దుకు 600 కిలోమీటర్లు కాగా, రోడ్డు మార్గంలో చేరుకునేందుకు సుమారు 8 నుంచి 12 గంటలు పడుతుంది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img