Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

ఉక్రెయిన్‌ నుంచి ఒక్కరోజే 1377 మంది భారత్‌కు…: విదేశాంగశాఖ

ఉక్రెయిన్‌లో చిక్కుకుపోయిన భారతీయుల తరలింపు ప్రక్రియను కేంద్ర ప్రభుత్వం ముమ్మరం చేసింది. నిన్న ఒక్కరోజే 1300 మందికి పైగా పౌరులను స్వదేశానికి తరలించినట్లు విదేశాంగశాఖ బుధవారం వెల్లడిరచింది. ఉక్రెయిన్‌ రాజధాని కీవ్‌లో ప్రస్తుతం భారత పౌరులెవరూ లేరని స్పష్టంచేసింది. ఆపరేషన్‌ గంగ కార్యక్రమం కింద గడిచిన 24 గంటల్లో ఆరు విమానాలు భారత్‌కు బయలుదేరాయని, నిన్న ఒక్క రోజే 1377 మంది భారత పౌరులను ఉక్రెయిన్‌ నుంచి స్వదేశానికి తరలించామని విదేశాంగ మంత్రి ఎస్‌.జైశంకర్‌ నేడు ట్విట్టర్‌లో పేర్కొన్నారు. మరోవైపు ప్రస్తుతం ఉక్రెయిన్‌ రాజధాని కీవ్‌ను భారత పౌరులందరూ వీడినట్లు విదేశాంగ కార్యదర్శి హర్షవర్ధన్‌ శ్రింగ్లా తెలిపారు. వచ్చే మూడు రోజుల్లో మరోన 26 విమానాల ద్వారా భారత పౌరులను తీసుకురానున్నట్లు తెలిపారు.
రొమేనియాకు వెళ్లిన సీ-17 విమానం
ఇక ఉక్రెయిన్‌లో చిక్కుకున్న భారతీయులను స్వదేశానికి తరలించేందుకు భారతీయ వాయుసేన రంగంలోకి దిగింది. భారతీయుల తరలింపునకు చేపట్టిన ఆపరేషన్‌ గంగలో భాగంగా వాయుసేనకు చెందిన సీ-17 రవాణా విమానం రొమేనియా బయల్దేరివెళ్ల్లింది. సోమవారం తెల్లవారుజామున 4 గంటల సమయంలో ఉత్తరప్రదేశ్‌లోని గజియాబాద్‌లో ఉన్న హిండన్‌ ఎయిర్‌బేస్‌ నుంచి బయలుదేరి వెళ్లినట్లు అధికారులు తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img