Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

ఉక్రెయిన్‌ నుంచి మరో 629 మంది భారత్‌కు..

ఇంకా ప్రమాదకర ప్రాంతాల్లో 1000 మంది
ఉక్రెయిన్‌లో చిక్కుకున్న భారతీయుల్లో మరో 629 మంది శనివారం తెల్లవారుజామున మన దేశానికి సురక్షితంగా చేరుకున్నారు. ఆపరేషన్‌ గంగ పేరిట చేపట్టిన తరలింపులో భాగంగా భారత వాయుసేన (ఐఏఎఫ్‌)కు చెందిన విమానాలు రొమేనియా, స్లొవేకియా, పోలాండ్‌ నుంచి 629 మందిని ఉత్తరప్రదేశ్‌లోని హిండన్‌ విమానస్థావరానికి చేర్చాయి. ఆపరేషన్‌ గంగలో భాగంగా భారత వాయుసేనకు చెందిన విమానాలు ఆయా దేశాలకు 10 చక్కర్లు కొట్టినట్లు ఓ ప్రకటనలో అధికారులు తెలిపారు. మొత్తం 2,056 మందిని సురక్షితంగా తీసుకొచ్చామన్నారు. ఇంకా 2000`3000 మంది భారతీయులు ఉక్రెయిన్‌లో ఉన్నట్లు అంచనా ఉందని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి అరిందమ్‌ బాగ్చీ తెలిపారు. మరో వైపు పరిస్థితులు ఆందోళనకరంగా ఉన్న తూర్పు ఉక్రెయిన్‌లో ఇంకా 1,000 మంది భారతీయలు ఉన్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. 700 సుమీలో, 300 మంది ఖర్కివ్‌లో ఉన్నట్లు తెలిపింది. వారందరినీ సురక్షితంగా భారత్‌కు చేర్చడం పైనే ప్రధానంగా దృష్టి సారించామన్నారు. వారందరినీ అక్కడి నుంచి సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు బస్సులు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img