Wednesday, April 24, 2024
Wednesday, April 24, 2024

ఉద్యోగుల ఉద్యమబాట

ప్రారంభమైన నిరసనలు
. 17, 20 తేదీల్లో ప్రభుత్వ కార్యాలయాల్లో పర్యటనలు
. 21 నుంచి ఏప్రిల్‌ 5 వరకు వర్క్‌ టు రూల్‌
. 27న కారుణ్య నియామకాల బాధిత కుటుంబాలకు పరామర్శ
. ఏపీ జేఏసీ అమరావతి రాష్ట్ర కార్యవర్గం నిర్ణయాలు

విశాలాంధ్ర బ్యూరో – అమరావతి: ‘ఉద్యోగుల డిమాండ్లపై జగన్‌ సర్కారు ఇచ్చిన లిఖితపూర్వక హామీ(మినిట్ల)లో స్పష్టత లేదు. స్పష్టతలేని హామీ వల్లే ఉద్యమాన్ని కొనసాగిస్తున్నాం. గురువారం నుంచి ఏప్రిల్‌ 5 వరకు నల్లబ్యాడ్జీలతో నిరసన ప్రారంభిస్తున్నాం’ అని ఏపీ జేఏసీ అమరావతి ప్రకటించింది. ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, విశ్రాంత, కాంట్రాక్ట్‌, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం ఏపీ జేఏసీ అమరావతి రాష్ట్ర కార్యవర్గం తీర్మానం మేరకు ఇప్పటికే ఉద్యమ కార్యాచరణ ప్రకటించారు. దానిపై ఈనెల 7వ తేదీన ఉద్యోగ సంఘాలతో మంత్రివర్గ ఉపసంఘం చర్చలు జరిపింది. అవి మొక్కుబడిగానే సాగాయి. దీనికి ఏపీ జేఏసీ అమరావతి పక్షాన నేతలు హాజరై…ఉద్యోగుల ఆర్థిక, ఆర్థికేతర అంశాల్ని మంత్రుల కమిటీ దృష్టికి తీసుకెళ్లింది. ప్రభుత్వం నుంచి స్పష్టత లేనందున గురువారం విజయవాడ రెవెన్యూ భవన్‌లో ఏపీ జేఏసీ అమరావతి చైర్మన్‌ బొప్పరాజు అధ్యక్షతన అత్యవసర కార్యవర్గం భేటీ అయింది. దీనికి సెక్రటరీ జనరల్‌ పలిశెట్టి దామోదరరావు, అసోషియేట్‌ చైర్మన్‌ టీవీ ఫణిపేర్రాజు, కోశాధికారి వీవీ మురళీ కృష్ణంనాయుడు, ఆర్గనైజింగ్‌ కార్యదర్శి ఎస్‌.కృష్ణమోహన్‌, ప్రచార కార్యదర్శి బి.కిషోర్‌కుమార్‌తోపాటు 26 జిల్లాల జేఏసీ చైర్మన్లు, ప్రధాన కార్యదర్శులు, జేఏసీ రాష్ట్ర కమిటీ, జేఏసీ అమరావతి అనుబంధ సంఘాల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు హాజరయ్యారు. ప్రభుత్వం ఇచ్చిన రాతపూర్వక ప్రతులపై చర్చించి, కొద్దిపాటి సవరణలతో ఉద్యమ కార్యాచరణను రూపొందించాలని సమావేశం నిర్ణయించింది. సమావేశం వివరాలను బొప్పరాజు వెంకటేశ్వర్లు, పలిశెట్టి దామోదరరావు వెల్లడిరచారు.
ప్రభుత్వం దగా: బొప్పరాజు, దామోదరరావు
ఉద్యోగుల డిమాండ్లపై ప్రభుత్వం ఇచ్చిన లిఖిత పూర్వక ప్రతి(మినిట్లు)లో ఎలాంటి స్పష్టత లేదని, ఉద్యోగులను ప్రభుత్వం దగా చేసిందని బొప్పరాజు వెంకటేశ్వర్లు, పలిశెట్టి దామోదరరావు ధ్వజమెత్తారు. దీంతో గురువారం మధ్యాహ్నం నుంచే రాష్ట్రవ్యాప్తంగా ఉద్యోగులు నల్లబ్యాడ్జీలతో నిరసనలు ప్రారంభించినట్లు చెప్పారు. ఉద్యోగులు దాచుకున్న (జీపీఎఫ్‌, ఏపీజీఎల్‌ఐ తదితర ప్రయోజనాలు) డబ్బులు దాదాపు రూ.3వేల కోట్లను ఈ నెలాఖరులోగా చెల్లిస్తామని, ఉద్యోగులకు చట్టబద్ధంగా రావాల్సిన దాదాపు రూ.2వేల కోట్లను సెప్టెంబర్‌ లోపు రెండు విడతలుగా చెల్లిస్తామని చెప్పడం మినహా మిగిలిన వాటిపై ప్రస్తావనే లేదన్నారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి(సీఎస్‌)కి సమర్పించిన 50 పేజీల వినతిపత్రంలో ఆర్థికపరమైన 11వ పీఆర్సీ పే స్కేళ్లు, స్పెషల్‌ పేలు వెరసి రూ.5వేల కోట్లకుపైగా రావాలని వివరించారు. వాటితోపాటు పీఆర్సీ, డీఏ బకాయిలు, సీపీఎస్‌ ఉద్యోగుల అంశం తేలాల్సి ఉందన్నారు. ప్రతినెల ఒకటో తేదీన జీతభత్యాలు చెల్లించడం తదితర అంశాలపై స్పష్టత లేదని వివరించారు. ఆర్థికేతర అంశాలు ప్రధానంగా సీపీఎస్‌ రద్దు, ఔట్‌ సోర్సింగు ఉద్యోగులకు జీతభత్యాల పెంపుదల, కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ, గ్రామ/వార్డు సచివాలయ, ఆర్టీసీ ఉద్యోగుల సమస్యలు, వారి ప్రయోజనాలపై ప్రభుత్వం నుంచి స్పష్టత లేదన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img