Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

ఉపాధి ఉసురు

. పనులపై కూలీల అనాసక్తి
. యాప్‌ ఆధారిత హాజరుతో ఇబ్బందులు
. చెల్లింపుల వ్యవస్థతో చిక్కులు
. జనవరి`ఫిబ్రవరిలో తగ్గిన పని దినాలు

న్యూదిల్లీ: మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (ఎంజీఎన్‌ఆర్‌ఈజీఏ) పై కూలీల్లో అనాసక్తి నెలకొంది. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఈ పథకం పట్ల తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. ఇటీవల బడ్జెట్‌లో సైతం అరకొర నిధులే కేటాయిం చింది. పేదలకు ఎంతోకొంత ఆసరాగా ఉన్న ఈ పథకాన్ని నిర్వీర్యం చేసేలా, కూలీలకు ఇబ్బందులు కలిగించేలా ఎప్పటికప్పుడు మార్పులు చేపడుతూ వస్తోంది. యాప్‌ ఆధారిత హాజరు వ్యవస్థను అమలు చేసిన తర్వాత ఈ ఏడాది జనవరి, ఫిబ్రవరిలో ఉపాధి హామీ పథకం కింద రూపొం దించబడిన కూలీల పని దినాలు గత సంవత్సరా లతో పోలిస్తే తగ్గాయని ఉపాధి సంఘాల సమూ హం సంకలనం చేసిన సమా చారం వెల్లడిరచింది. ఉపాధి హామీ కూలీల సంఘాలు దిల్లీలోని జంతర్‌ మంతర్‌ వద్ద కొత్త హాజరు, చెల్లింపు వ్యవస్థలకు వ్యతిరేకంగా నెల రోజులుగా నిరసనలు కొనసా గిస్తున్నాయి. నిరసనకు నాయకత్వం వహించిన ఎన్‌ఆర్‌ఈజీఏ సంఘర్ష్‌ మోర్చా ద్వారా సంకలనం చేయబడిన వివరాల ప్రకారం, ఈ ఏడాది జనవరి, ఫిబ్రవరిలో 34.59 కోట్ల పని దినాలు ఉన్నాయి. ఇది 53.07 కోట్ల పని దినాలు సృష్టించబడిన 2022 జనవరి, ఫిబ్రవరిలో కంటే గణనీయంగా తక్కువగా ఉంది. 2021లో అదే కాలంలో 56.94 కోట్ల పని దినాలు సృష్టించబడ్డాయి. 2019వ సంవత్సరం జనవరి, ఫిబ్రవరి నెలల్లో 47.86 కోట్ల పని దినాలు ఉండగా, 2020లో రెండు నెలల్లో 47.75 కోట్ల పని దినాలు ఉన్నాయి. ఎంఐఎస్‌ నివేదికను వినియోగించి ఈ సమాచారాన్ని సంకలనం చేశారు. గ్రామీణ ప్రాంతాలలో నెట్‌వర్క్‌ సమస్యల కారణంగా హాజరు పడటం లేదని, తక్షణమే యాప్‌ ఆధారిత హాజరు విధానాన్ని వెనక్కి తీసుకోవాలని, నేషనల్‌ మొబైల్‌ మానిటరింగ్‌ సిస్టమ్‌ (ఎన్‌ఎంఎంఎస్‌) ను నిరసిస్తున్న కూలీలు డిమాండ్‌ చేస్తున్నారు. అనేక మంది కూలీలకు ఏబీపీఎస్‌ ఖాతాలు లేకపోవడంతో తప్పనిసరి చేసిన ఆధార్‌ ఆధారిత చెల్లింపు వ్యవస్థ (ఏబీపీఎస్‌) పట్ల కూలీలు నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఎన్‌ఆర్‌ఈజీఏ సంఘర్ష్‌ మోర్చా వెల్లడిరచిన వివరాల ప్రకారం, జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం మొత్తం కూలీలలో 40 శాతం కంటే తక్కువ మంది ఏబీపీఎస్‌ చెల్లింపులకు అర్హులు. ఇది దేశవ్యాప్తంగా 10 కోట్ల మందికి పైగా కూలీలు. జియోట్యాగ్‌ చేయబడిన ఫోటోగ్రాఫ్‌లను రోజుకు రెండుసార్లు అప్‌లోడ్‌ చేయడం ద్వారా ఎంజీఎన్‌ఆర్‌ఈజీఏ పని ప్రదేశాల్లో కార్మికుల హాజరును రికార్డ్‌ చేయడానికి ఎన్‌ఎంఎంఎస్‌ యాప్‌ను ఉపయోగిస్తారు. దీనిని జనవరి 1, 2023న అన్ని పని ప్రదేశాలలో తప్పనిసరి చేశారు. జనవరి 30, 2023న గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ అన్ని వేతన చెల్లింపులను ఫిబ్రవరి 1 నుంచి ఆధార్‌ ఆధారిత చెల్లింపుల ద్వారా మాత్రమే చెల్లించనున్నట్లు ప్రకటిం చింది. ఉపాధి హామీ పథకం కింద దాదాపు 27.5 కోట్ల మంది నమోదిత కూలీలు ఉన్నారు. 2022-23లో 8.4 కోట్ల మంది కూలీలు పని చేశారు. 272.8 కోట్ల పని దినాలు సృష్టించబడ్డాయి. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం… ప్రతి ఇంటికి ఆర్థిక సంవత్సరంలో కనీసం 100 రోజుల వేతన ఉపాధిని అందించడం ద్వారా దేశంలోని గ్రామీణ ప్రాంతాల్లోని కుటుంబాల జీవనోపాధి భద్రతను పెంపొందించే లక్ష్యంతో రూపొందించబడిన ఒక ప్రధాన పథకం.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img