Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

ఎందుకింత నిర్లక్ష్యం?

ఉపాధి బిల్లుల చెల్లింపులపై హైకోర్టు సీరియస్‌

గత ప్రభుత్వ హయాంలో పనులు చేసిన కాంట్రాక్టర్లకు బిల్లుల బకాయిలు చెల్లించకుండా అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడంపై ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు గురువారం మరోసారి రాష్ట్ర ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. బిల్లుల చెల్లింపు కోసం ఎన్నిసార్లు ఆదేశాలు ఇచ్చినా పట్టించుకోరా ? అని ప్రశ్నించింది. ఆగస్టు ఒకటిలోగా బిల్లులు చెల్లించాల్సిందేనని డెడ్‌లైన్‌ విధించింది. ఇందులో విఫలమైతే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది.
చీఫ్‌ జస్టిస్‌ అధ్వర్యంలోని ధర్మాసనం నరేగా నిధులపై విచారణ చేపట్టింది. వివిధ పిటిషన్లను కలిపి హైకోర్టు ధర్మాసనం విచారించింది. ఆగస్టు 1వ తేదీ లోగా ఉపాధి హామీ పెండిరగ్‌ బిల్లులు చెల్లించకపోతే పంచాయతీరాజ్‌, ఆర్థికశాఖల ముఖ్య కార్యదర్శులు కోర్టుకు హాజరై సంజాయిషీ ఇవ్వాల్సి ఉంటుందని హైకోర్టు స్పష్టం చేసింది. ఇప్పటికే వీరిద్దరూ ఒకసారి కోర్టుకు హాజరై బిల్లుల చెల్లింపులపై వివరాలు అందించారు. అయినా ఇప్పటికీ బిల్లుల బకాయిలు చెల్లించకపోవడమేమిటంటూ తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. కోర్టు ఎన్నిసార్లు చెప్పినా ఎందుకు అమలు చేయట్లేదని ప్రశ్నిస్తూ, ఇంకెన్నిసార్లు చెప్పించుకుంటారని నిలదీసింది.
సీఎస్‌ ఆదిత్యనాథ్‌ను కూడా పిలిపించాలని హైకోర్టు తొలుత భావించింది. నిధులు వెంటనే చెల్లిస్తామని ప్రభుత్వ తరపు న్యాయవాది నచ్చజెప్పడంతో ఈసారి ఇచ్చిన గడువులోగా చెల్లింపులు చేపట్టాలని హైకోర్టు ఆదేశించింది. సుమారు రూ2,500 కోట్ల నరేగా నిధులు పెండిరగ్‌లో ఉన్నట్లు తెలుస్తోంది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img