Wednesday, April 24, 2024
Wednesday, April 24, 2024

ఎందుకీ ఆలస్యం?

మార్చి 11లోగా కౌంటర్‌ దాఖలు చేయండి
టీటీడీలో నేర చరితులకు హైకోర్టు డెడ్‌లైన్‌

విశాలాంధ్ర బ్యూరో` అమరావతి: తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి సభ్యులు, ప్రత్యేక ఆహ్వానితుల నియామకం వ్యవహారంపై న్యాయపరమైన చిక్కులు ఇంకా కొనసాగుతున్నాయి. టీటీడీ సభ్యులుగా నియమిస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవోను, అలాగే భారీ సంఖ్యలో ప్రత్యేక ఆహ్వానితుల్ని నియమిస్తూ ఇచ్చిన జీవోపైనా దాఖలైన పిటిషన్లపై మంగళ వారం హైకోర్టు విచారణ జరిపింది. బోర్డు సభ్యుల్లో 18 మంది నేరచరిత్ర ఉన్నవారుం డగా, వారిలో 16 మంది సభ్యులు ఇప్పటి వరకు కౌంటర్‌ దాఖలు చేయలేదని పిటిషనర్‌ తరపు న్యాయవాది ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. టీటీడీ బోర్డులో ప్రత్యేక ఆహ్వానితుల నియామకంపై భానుప్రకాష్‌ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై ప్రభుత్వ తరపు న్యాయవాది వివరణ ఇస్తూ, ఆర్డినెన్స్‌ ద్వారా 52 మంది సభ్యులను ప్రత్యేక ఆహ్వానితులుగా నియమించామని కోర్టుకు తెలిపారు. ఆర్డినెన్స్‌ ద్వారా సభ్యులను నియమించుకోవాల్సిన పరిస్థితులు ఏమున్నాయంటూ పిటిషనర్‌ తరపు న్యాయవాది వాదించారు. దీనిపై ధర్మాసనం స్పందిస్తూ ఆర్డినెన్స్‌పై పిటిషన్‌ దాఖలు చేసుకోవాలని సూచించింది. ఇక నేరచరిత ఉన్న బోర్డు సభ్యులు 16 మంది కౌంటర్‌ దాఖలు చేయకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. రెండు వారాల్లో కౌంటర్‌ దాఖలు చేయాలంటూ వీరికి హైకోర్టు ఆదేశించింది. మార్చి 11లోగా కౌంటర్‌ దాఖలు చేయకపోతే ఇక నేరుగా విచారణ చేపడతామని హైకోర్టు స్పష్టం చేసింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img