Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

ఎంపీఐలో ఏపీకి 9వ ర్యాంకు

నీతి ఆయోగ్‌ సలహాదారు సమాదార్‌ వెల్లడి
సీఎం జగన్‌కు నీతి ఆయోగ్‌ బృందం నివేదిక

అమరావతి : బహుముఖ పేదరిక సూచీ(ఎంపీఐ)లో ఆంధ్రప్రదేశ్‌ 9వ ర్యాంకులో ఉందని నీతి ఆయోగ్‌ సలహాదారు సాన్యుక్తా సమాదార్‌ వెల్లడిర చారు. అమరావతి సచివాలయంలో సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు(ఎస్‌డీజీ)202122, బహుముఖ పేదరిక సూచీ(ఎంపీఐ)పై శుక్రవారం రెండోరోజు రాష్ట్ర స్థాయి సదస్సు నిర్వహించాయి. ఈ సదస్సులో సమాదార్‌ మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా ఎంపీఐ ర్యాంకింగ్‌లో 107 దేశాల్లో భారత్‌ 62వ స్థానంలో నిలవగా, దేశంలో ఆంధ్రప్రదేశ్‌కు 9వ ర్యాంకు లభించిందని పేర్కొన్నారు. సుస్థిరాభివృద్ధి, బహుముఖ పేదరిక సూచీల లక్ష్యాల్ని

అధిగమించేందుకుగాను దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు కృషి ప్రారంభించాలన్నారు.
సుస్థిరాభివృద్ధిలో ఏపీకి మూడో స్థానం
సీఎం ముఖ్యకార్యదర్శి ప్రవీణ్‌ ప్రకాష్‌ మాట్లాడుతూ మానవాభివృద్ధి సూచికల విషయంలో ఆంధ్రప్రదేశ్‌ అగ్రస్థానంలో నిలిచిందన్నారు. సుస్థిరాభివృద్ధి లక్ష్యాలలో ఎస్జీడీ ఇండియా సూచీ నివేదిక2020 ఆధారంగా రాష్ట్రం మూడో స్థానంలో ఉందని వివరించారు. సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేస్తున్న సంక్షేమ కృషికిగాను రాష్ట్రాన్ని..మొదటి స్థానంలో నిలపాల్సిన అవసరముందన్నారు. పేదరిక నిర్మూలనకు సంబంధించిన వివిధ పథకాలకు పెద్దఎత్తున నిధులు సమకూర్చుతు న్నామని పేర్కొన్నారు. సక్రమంగా ప్రణాళికాబద్ధంగా కృషిచేస్తే రాష్ట్రాన్ని మొదటి స్థానంలో నిలపవచ్చని ఆయన అభిప్రాయం వ్యక్తంచేశారు. వైద్యం, విద్య, పేదరిక నిర్మూలన తదితర అంశాలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టి, 75శాతం సమయం వాటిపైనే వెచ్చిస్తోందన్నారు. రెండు రోజులపాటు ఇక్కడ సదస్సు నిర్వహించిన నీతిఆయోగ్‌ బృందానికి ప్రభుత్వం తరపున ఆయన ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్ర ప్రణాళికశాఖ కార్యదర్శి జీఎస్‌ఆర్కే విజయ్‌కుమార్‌ మాట్లాడుతూ సుస్థిరాభివృద్ధి లక్ష్యాల సాధనపై రాష్ట్ర, జిల్లాస్థాయి అధికారులకు చాలా అంశాలపై అవగాహన కల్పించినందుకు అభినందించారు. రాబోయే రోజుల్లో నిర్దేశిత లక్ష్య సాధనపై మరిత దృష్టి సారిస్తామన్నారు. సదస్సులో నీతి ఆయోగ్‌ అధికారులు అలెన్‌జాన్‌, సౌరవ్‌ దాస్‌ పాల్గొన్నారు. ముఖ్యమంత్రిని కలిసిన నీతిఆయోగ్‌ బృందం తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో సమాదార్‌తో కూడిన బృందం సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసింది. సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు(ఎస్‌డీజీ)202021 సూచీ నివేదికను అంద జేశారు. సీఎంను కలిసిన వారిలో నీతిఆయోగ్‌ బృంద సభ్యులు అలెన్‌జాన్‌, సౌరవ్‌దాస్‌, రాష్ట్ర ప్రణాళికాశాఖ కార్యదర్శి జీఎస్‌ఆర్‌కేఆర్‌ విజయ్‌కుమార్‌ ఉన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img