Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

ఎన్టీఆర్‌ హెల్త్‌ వర్సిటీకి వైఎస్‌ఆర్‌కు ఏం సంబంధం? : చంద్రబాబు సూటి ప్రశ్న

ఎన్టీఆర్‌ హెల్త్‌ యూనివర్సిటీకి ఎన్టీఆర్‌ పేరు తొలగించాలని నిర్ణయించడం జగన్‌ ప్రభుత్వ దివాళాకోరుతనానికి నిదర్శనమని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మండిపడ్డారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. 1986లో ఏర్పాటైన ఎన్టీఆర్‌ హెల్త్‌ యూనివర్సిటీకి వైఎస్‌ఆర్‌కు ఏం సంబంధమని నిలదీశారు. ఎన్టీఆర్‌ నిర్మించిన విశ్వవిద్యాలయానికి తండ్రి పేరు ఎలా పెట్టుకుంటాడని నిలదీశారు. హెల్త్‌ యూనివర్సిటీకి ఎన్టీఆర్‌ పేరు కొనసాగించాల్సిందే అని స్పష్టం చేశారు. ఉన్న సంస్థలకు పేర్లు మార్చితే పేరు రాదని, కొత్తగా నిర్మిస్తే పేరు వస్తుందని హితవు పలికారు. తెలుగు దేశం పార్టీ దీన్ని పూర్తిగా వ్యతిరేకిస్తుందని చంద్రబాబు అన్నారు.‘‘హెల్త్‌ యూనివర్సిటీకి ఎన్టీఆర్‌ పేరు తొలగింపు జగన్‌ ప్రభుత్వ దివాళాకోరుతనానికి నిదర్శనం. తెలుగుదేశం పార్టీ దీన్ని పూర్తిగా వ్యతిరేకిస్తోంది. వైద్య విద్యకు ప్రత్యేక విశ్వవిద్యాలయం ఉండాలనే సంకల్పంతో నాటి ముఖ్యమంత్రి ఎన్టీఆర్‌ 1986లో ఈ హెల్త్‌ యూనివర్సిటీని ఏర్పాటు చేశారు.ఎన్టీఆర్‌ హెల్త్‌ వర్సిటీకి చెందిన రూ.450 కోట్ల నిధులను సైతం బలవంతంగా కాజేసిన జగన్‌ ప్రభుత్వం.. ఏ హక్కుతో వర్సిటీ పేరు మార్చుతుంది? కనీసం స్నాతకోత్సవం నిర్వహణకు కూడా నిధులు లేకుండా చేసిన వీళ్ళు ఇప్పుడు పేరు మార్చుతారా? అసలు ఎన్టీఆర్‌ హెల్త్‌ యూనివర్సిటీకి వైఎస్‌ఆర్‌ కు ఏం సంబంధం ఉంది? దశాబ్దాల నాటి సంస్థలకు ఉన్న పేర్లు మార్చి కొత్తగా మీ పేర్లు పెట్టుకుంటే మీకు పేరు రాదు సరికదా…ప్రజలు మీ దిగజారుడుతనాన్ని ఛీకొడతారు. చేతనైతే కొత్తగా సంస్థలను నిర్మించండి. ఇకనైనా ప్రభుత్వం పిచ్చి ఆలోచనలు మానుకుని హెల్త్‌ యూనివర్సిటీకి ఎన్టీఆర్‌ పేరును యధావిధిగా కొనసాగించాలి.’’ అని చంద్రబాబు వరుస ట్వీట్లు చేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img