Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్థిగా వెంకయ్యనాయుడు..? బీజేపీ దక్షిణాది వ్యూహం!

రాష్ట్రపతి ఎన్నిక తేదీ సమీపిస్తున్న వేళ రాజకీయం రసవత్తరంగా మారింది. ఎన్డీయే అభ్యర్థిగా ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడి పేరు ప్రధానంగా వినిపిస్తోంది. దేశంలో ప్రస్తుతం నెలకొన్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో వెంకయ్యనాయుడిని రాష్ట్రపతి ఎన్నికల బరిలోకి దించాలని బీజేపీ భావిస్తున్నట్లు తెలుస్తోంది. మంగళవారం (జూన్‌ 21) మధ్యాహ్నం వెంకయ్య నాయుడి నివాసంలో హోం మంత్రి అమిత్‌ షా, రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌, బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా ఆయనతో సమావేశం కావడం ఈ వార్తలకు మరింత ఊతమిస్తోంది. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన మంగళవారం సాయంత్రం బీజేపీ పార్లమెంటరీ బోర్డు సమావేశం ఉంది. ఈ సమావేశానికి ముందు ఆ పార్టీ కీలక నేతలు వెంకయ్యనాయుడితో భేటీ కావడం హాట్‌ టాపిక్‌గా మారింది. ప్రతిపక్షాలు రాష్ట్రపతి ఎన్నికల్లో ఉమ్మడి అభ్యర్థిని బరిలో దింపేందుకు ఇప్పటికే కసరత్తు ముమ్మరం చేశాయి. సుమారు 16 పార్టీలు ఏకతాటిపైకి వచ్చాయి. ఇలాంటి పరిణామాల నేపథ్యంలో.. వెంకయ్యనాయుడిని బలమైన అభ్యర్థిగా బీజేపీ భావిస్తున్నట్లు తెలుస్తోంది. వెంకయ్యనాయుడిని బరిలో నిలపడం ద్వారా.. తెలుగు రాష్ట్రాల్లో ప్రధాన పార్టీలు మద్దతు తెలపాల్సిన తప్పనిసరి పరిస్థితిని బీజేపీ కల్పిస్తున్నట్లు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
రాష్ట్రపతి అభ్యర్థిత్వంపై అటు ప్రతిపక్ష పార్టీలు కూడా మంగళవారం సమావేశం కానున్నాయి. ఎన్సీపీ అధినేత శరద్‌ పవార్‌ నేతృత్వంలో ఈ సమావేశం జరుగనుంది. యశ్వంత్‌ సిన్హాను విపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా ప్రకటించే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రపతి ఎన్నికల్లో పోటీ చేసేందుకు యశ్వంత్‌ సిన్హా ఇప్పటికే సుముఖత వ్యక్తం చేశారు. టీఎంసీ పార్టీకి రాజీనామా చేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img