Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

ఎన్నాళ్లీ నిరీక్షణ..?

గ్రూప్‌`1,2 ప్రకటనలో జాప్యం
ఏడాదికో డీఎస్సీ దగా
రెండున్నరేళ్లయినా రాని ఉద్యోగాలు

విశాలాంధ్ర బ్యూరోఅమరావతి : ఏపీలో జాబ్‌ క్యాలెండరు విడుదల చేసి నాలుగు నెలలైనా గ్రూప్‌ 1,2 పోస్టులపై కదలిక లేదు. ఇంకెంతకాలం నిరీక్షించాలో తెలియక నిరుద్యోగులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే గ్రూప్స్‌తోపాటు డీఎస్సీ, పోలీసు విభాగాల పోస్టుల కోసం ఎదురు చూస్తున్న వారికి సకాలంలో వాటి ప్రకటనలు ఇవ్వనందున దాదాపు 3లక్షల మందికిపైగా వయోపరిమితి మించిపోయినట్లు తెలిసింది. వారి భవిష్యత్తు అంధకారంగా మారింది. ఏపీపీఎస్సీ సూచించిన 47 ఏళ్ల వయోపరిమితి పెంపుపైనా ప్రభుత్వం స్పందించకపోవడం, 42 ఏళ్లకు అనుమతి జారీచేయడంతో వెరసి లక్షలాది మంది అభ్యర్థులు చిన్నపాటి నోటిఫికేషన్ల ఉద్యోగాలకు దరఖాస్తు చేసేందుకు అనర్హులుగా మారిపోతున్నారు. దీనంతటికి రాష్ట్ర ప్రభుత్వం, ఉన్నతాధికారుల మధ్య సమన్వయం లోపమే కారణంగా భావిస్తున్నారు. క్షేత్రస్థాయి నుంచి జిల్లా అధికారులు ప్రభుత్వానికి, హడావుడీగా అసత్య సమాచారం ఇవ్వడంతోనే ఈ దుస్థితి నెలకొందనే విమర్శలున్నాయి. రెండున్నరేళ్ల వైసీపీ ప్రభుత్వ హయాంలో ఒక్క గ్రామ /వార్డు సచివాలయం ఉద్యోగాల మినహా మిగిలిన వాటి భర్తీకి నోటిఫికేషన్లు ఇవ్వలేదు. జాబ్‌ క్యాలెండరు షెడ్యూలుకే పరిమితం సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేతుల మీదుగా గతంలో 10,143పోస్టులకు జాబ్‌ క్యాలెండరు ప్రకటించారు. ఇది తొమ్మిది విభాగాలుగా ఉండి, జులై2021 నుంచి మార్చి2022 వరకు షెడ్యూలు విధించారు. జాబ్‌ క్యాలెండరులో జులైలో 1,238 ఎస్సీ, ఎస్టీ బ్యాక్‌లాగ్‌ పోస్టుల ఖాళీలు చూపారు. ఇవి జిల్లాల వారీగా భర్తీ చేశారు. ఏపీపీఎస్సీకి అప్పగించిన వివిధ పోస్టులపై ఇంతవరకు నోటిఫికేషన్లు విడుదల చేయలేదు. ఇప్పటికే నెల, రోజుల వ్యవధితో వయోపరిమితి మించిపోయేందుకు దగ్గరగా ఉన్న అభ్యర్థులకు దిక్కుతోచని పరిస్థితి నెలకొంది. ఆగస్టు2021లో గ్రూప్‌ 1,2 విభాగానికి నోటిఫికేషన్‌లో కేవలం 36పోస్టులే చూపించారు. దానిపై విద్యార్థి, యువజన, నిరుద్యోగ సంఘాల నుంచి పెద్దఎత్తున నిరసనలు వ్యక్తం చేశారు. వారికి అన్ని రాజకీయ పార్టీల నేతలు సంఫీుభావం తెలిపా రు. సీఎం క్యాంపు కార్యాలయం ముట్టడికి నిరుద్యోగులు యత్నించడంతో, ఉద్యమం తీవ్ర రూపం దాల్చింది. దీనిపై ఏపీపీఎస్సీ సభ్యులు స్పందించినప్పటికీ, ఖాళీలపై ఇంత వరకూ స్పష్టత రాలేదు. గ్రూప్‌ 1,2లో ఒక్క ఖాళీ పెరిగిన ట్లు ఇంతవరకూ ప్రకటించలేదు. సెప్టెంబరు2021లో పోలీసు విభాగానికి 450 పోస్టులతో షెడ్యూలులో ఉంచి నప్పటికీ దానిపై స్పందన లేదు. వాస్తవంగా పోలీసుశా ఖలో వేలాదిగా ఖాళీలు ఉన్నప్పటికీ, 450 పోస్టులతోనే సరిపెట్టడంపైనా విమర్శలున్నాయి. వాటికి ఆర్థికశాఖ నుంచి అనుమతి వచ్చినప్పటికీ, ఖాళీలు పెంచాలంటూ నిరుద్యోగుల నుంచి ఒత్తిడి రావడంతో ఆయా నోటిఫికేషన్ల జారీపై ప్రభుత్వం వెనక్కి తగ్గిందనే ప్రచారముంది. ఏడాదికో డీఎస్సీ ఏది ? ఎన్నికల ముందు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తన పాదయా త్రలోను, మేనిఫెస్టోలోను ఏటా ఒక డీఎస్సీ ఇస్తామంటూ హామీ ఇచ్చారు. ఆ హామీ మేరకు వైసీపీ ప్రభుత్వం అధికా రంలోకి వచ్చి దాదాపు రెండున్నరేళ్లు అయినప్పటికీ, ఇంతవరకూ ఉపాధ్యాయ ఖాళీల భర్తీ ప్రక్రియకు చెందిన డీఎస్సీపై స్పందన లేదు. జగన్‌ అధికారంలోకి రాక ముందు, గత ప్రభుత్వం అరకొర ఖాళీలతోనే డీఎస్సీ ప్రకటించింది. చాలా జిల్లాల్లో కనీసం కేటగిరీకి, సబ్జెక్టుకు ఒక్క ఖాళీ సైతం లేకుండా పోయింది. దీనిపై నిరుద్యో గులు ఆవేదన చెంది, జిల్లాలకు జగన్‌ పాదయాత్రగా వచ్చినప్పుడు కలిసి సమస్యల్ని వివరించారు. తాను అధికారంలోకి వచ్చిన వెంటనే ఏటా రూ.10వేలకు తగ్గకుండా డీఎస్సీ ప్రకటిస్తామని హామీ ఇచ్చారు. గత ఎన్నికల సమయానికే వేలాది మంది డీఎస్సీ అభ్యర్థులకు వయోపరిమితి కుంచించుకుపోయింది. గత డీఎస్సీ 2018 వరకు జనరల్‌ అభ్యర్థులకు 44ఏళ్ల వరకు అవకా శం కల్పించారు. 44ఏళ్ల ఆధారంగా గత డీఎస్సీ`20 18లో దాదాపు 3లక్షలకుపైగా అభ్యర్థులు పరీక్ష రాసి, ఖాళీలు పూర్తి స్థాయిలో లేనందున ఉపాధ్యాయ ఉద్యో గాలు పొందలేక పోయారు. జగన్‌ అధికారంలోకి వచ్చిన మొదటి ఏడాది డీఎస్సీ ఇవ్వనందున చాలా మందికి 44 ఏళ్లు మించిపోయి అనర్హులుగా మారారు. రెండో ఏడాది డీఎస్సీ ఇవ్వనందున వేలాది మంది డీఎస్సీకి దూరమ య్యే పరిస్థితులున్నాయి. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగాలకు జనరల్‌ అభ్యర్థులకు కేవలం 42 ఏళ్ల వరకే వయోపరిమితి విధిస్తూ ఉత్తర్వుల జారీజేసింది. ఈ నిబంధన ఆధారంగా డీఎస్సీ ఖాళీలను భర్తీ చేస్తే, మొత్తంగా దాదాపు 3లక్షల మందికిపైగా వయోపరిమితి మించిపోయి అనర్హులుగా మారే ప్రమాదముంది. డీఎస్సీ తోపాటు ఇతర విభాగాల ఉద్యోగాలకు వయోపరిమితిని జనరల్‌ అభ్యర్థులకు 47 ఏళ్లకు పెంచాలంటూ నిరుద్యోగ జేఏసీ నేతలు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలకు శ్రీకారం చుట్టారు. ఇప్పటికైనా ప్రభుత్వం మేల్కొని రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 2.50లక్షల ఉద్యోగాలతోపాటు జనరల్‌ అభ్యర్థుల వయోపరిమితిని 47 ఏళ్లకు పెంచేందుకు చర్యలు తీసుకోవాల్సిన అవసరముంది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img