Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

దానిపై..మీ చర్యలేమిటో తెలపండి


త్రిపుర సర్కారును ప్రశ్నించిన సుప్రీం

ఎన్నికలు సజావుగా జరిగేందుకు తీసుకుంటున్న చర్యలపై సమగ్ర ప్రకటన చేయాలని ఆ రాష్ట్ర సర్కార్‌ను సుప్రీంకోర్టు నిలదీసింది. స్థానిక సంస్థల ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ రోజురోజుకూ త్రిపురలో హింస పెరుగుతోందంటూ టీఎంసీ దాఖలు చేసిన కంటెప్ట్‌ పిటిషన్‌పై ముఖ్యమంత్రి విప్లవ్‌ దేవ్‌ను ఆదేశించింది. ఇవాళ, రేపు పోలింగ్‌ బూత్‌ల వద్ద భద్రత కోసం తీసుకుంటున్న చర్యలు, పోలింగ్‌ రోజు నుంచి ఫలితాలు వెల్లడిరచేంత వరకూ సజావుగా సాగేందుకు తీసుకుంటున్న చర్యలపై పోలీసులు, హోం సెక్రటరీ నుంచి స్పష్టమైన సమాచారం తీసుకుని ఇవాళ మధ్యాహ్నం 12.45 గంటలకు తిరిగి మాకు తెలియజేయండి అని కోర్టు ఆదేశించింది. విచారణ సందర్భంగా టీఎంసీ తరఫు న్యాయవాది తన వాదన వినిపిస్తూ, త్రిపురలో పలు హింసాత్మక ఘటనలు చోటుచేసున్నాయని అన్నారు. తాము సమర్పించిన స్క్రీన్‌షాట్లలో హింస జరగినప్పుడు పోలీసులు అచేతనంగా నిలబడి ఉండటం చాలా స్పష్టంగా మీరు చూడవచ్చని ఆయన కోర్టు దృష్టికి తెచ్చారు. దీనిపై త్రిపుర ప్రభుత్వ న్యాయవాది మహేష్‌ జెఠ్మలానీని జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ సారథ్యంలోని ధర్మాసనం ప్రశ్నిస్తూ, ఎన్నికలు స్వేచ్ఛగా, సజావుగా జరిగేందుకు మీ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలేమిటో తెలపాలని కోర్టు అడిగింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img