Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

ఎప్పటికీ ఉండిపోయే వ్యాధి దశలోకి కొవిడ్‌ !

: డబ్ల్యుహెచ్‌వో ప్రముఖ శాస్త్రవేత్త డాక్టర్‌ సౌమ్యా స్వామినాథన్‌
భారత్‌లో కరోనా ఓ మోస్తరు స్థాయిలో ఎప్పటికీ ఉండిపోయే వ్యాధి దశలోకి మారుతున్నట్లు కనిపిస్తోందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో)కు చెందిన ప్రముఖ శాస్త్రవేత్త డాక్టర్‌ సౌమ్యా స్వామినాథన్‌ అభిప్రాయపడ్డారు. ఇటువంటి పరిస్థితిలో జనం ఈ వైరస్‌తో సహజీవనం చేస్తూ, అప్రమత్తంగా ఉండాలన్నారు. ఓ న్యూస్‌ వెబ్‌సైట్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడారు. కొవిడ్‌ నుంచి ఉపశమనం లభించాలంటే దీర్ఘకాలం పడుతుందన్నారు. దేశంలోని ప్రజల అలవాట్ల కారణంగా వారి రోగ నిరోధక శక్తి పలువిధాలుగా ఉంటుందని, ఇది కరోనా స్థానికత స్థాయికి కారణం కావచ్చని చెప్పారు. సెప్టెంబరు మధ్య నాటికి భారత్‌ బయోటెక్‌ కొవాగ్జిన్‌ టీకాకు డబ్ల్యూహెచ్‌ఓ సాంకేతిక బృందం ఆమోదం తెలిపే అవకాశం ఉందన్నారు. 2022 చివరి నాటికి వ్యాక్సినేషన్‌ లక్ష్యం పూర్తయితే తిరిగి సాధారణ పరిస్థితులు నెలకొనే అవకాశముందన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img