Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్‌.. స్థానిక కోటాలో వైసీపీ అభ్యర్థులదే విజయం

ఏపీలో ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్‌ మొదలైంది. 4 స్థానిక సంస్థలు, 3 పట్టభద్ర, 2 ఉపాధ్యాయ స్థానాలకు ఈనెల 13న ఎన్నికలు జరగ్గా.. ఇవాళ కౌంటింగ్‌ చేపట్టారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికార వైఎస్సార్‌సీపీ హవా కొనసాగింది. ఎన్నికలు జరిగిన 4 స్థానాల్లో వైసీపీ అభ్యర్థులు ఘన విజయం సాధించారు. కర్నూలు జిల్లా స్ధానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి డాక్టర్‌ మధుసూదన్‌ విజయం సాధించారు. ఇక్కడ మ్నెత్తం 1,178 ఓట్లు ఉండగా.. 1,136 ఓట్లు పోలయ్యాయి. ఇందులో 53 చెల్లని ఓట్లు గుర్తించిన ఎన్నికల కౌంటింగ్‌ అధికారులు.. మిగిలిన 1,083 ఓట్లకు లెక్కింపు నిర్వహించారు. ఇందులో వైసీపీ అభ్యర్థి డాక్టర్‌ మధుసూదన్‌కు 988 ఓట్లు రాగా.. స్వతంత్ర అభ్యర్థి గుట్టపాడు మోహన్‌ రెడ్డికి 85 ఓట్లు, మరో స్వతంత్ర అభ్యర్థి భూమా వెంకట గోపాల్‌ రెడ్డికి 10 ఓట్లు వచ్చాయి. దీంతో వైసీపీ అభ్యర్థి డాక్టర్‌ మధుసూదన్‌ విజయం సాధించారు.శ్రీకాకుళం స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి నత్తు రామారావు విజయం సాధించారు. ఇక్కడ మొత్తం 752 మంది స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. వైసీపీకి చెందిన నత్తు రామారావుకు 632 ఓట్లు రాగా.. ఆయన సమీప ప్రత్యర్థి, స్వతంత్ర అభ్యర్థి ఆనేపు రామకృష్ణకు 108 ఓట్లు వచ్చాయి. మరో 12 ఓట్లు చెల్లుబాటు కాలేదు.
పశ్చిమ గోదావరి ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు విజయం సాధించారు. ఈ జిల్లాలో రెండు స్థానాలకు ఎన్నికలు జరగ్గా.. వైసీపీకి చెందిన కవురు శ్రీనివాస్‌, వంకా రవీంద్రనాథ్‌ గెలుపొందారు. జిల్లాలో మొత్తం 1105 ఓట్లు ఉండగా.. 1,088 మందిస్థానిక ప్రజాప్రతినిధులు ఓటు హక్కను వినియోగించుకున్నారు. కవురు శ్రీనివాస్‌కు 481 ఓట్లు రాగా, వంకా రవీంద్రనాథ్‌కు 460 ఓట్లు వచ్చాయి. స్వతంత్ర అభ్యర్థి వీరవల్లి చంద్రశేఖర్‌కు 120 ఓట్లు పోలయ్యాయి.
ఇక ఉపాధ్యాయ, పట్టుబధ్రుల ఎమ్మెల్సీ స్థానాలకు సంబంధించిన కౌంటిగ్‌ జరగుతోంది. ఉపాధ్యాయ ఎమ్మ్ల్సె స్థానాలకు సంబంధించిన రిజల్ట్‌ త్వరగానే వచ్చే అవకాశం ఉన్నా.. పట్టభద్రుల స్థానాలకు సంబంధించిన ఫలితాలు మాత్రం ఆలస్యమయ్యే అవకాశం ఉంది. వాటిని ప్రాధాన్యత క్రమంలో లెక్కించాల్సి ఉన్న నేపథ్యంలో మరో రెండు రోజులు పట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇక తెలంగాణలోనూ ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్‌ ప్రారంభమైంది. హైదరాబాద్‌- రంగారెడ్డి- మహబూబ్‌నగర్‌ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి ఈనెల 13నే ఎన్నిక జరగ్గా.. ప్రస్తుతం కౌంటింగ్‌ జరుగుతోంది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img