Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

ఎయిడెడ్‌ స్వచ్ఛందమే

ఏ విద్యాసంస్థనూ బలవంతంగా తీసుకోం
ఇష్టపూర్వకంగా అప్పగిస్తే నిర్వహిస్తాం
స్కూళ్లన్నింటికీ సీబీఎస్‌ఈ అఫిలియేషన్‌
75 శాతం హాజరుంటేనే అమ్మఒడి
విద్యాశాఖ సమీక్షలో సీఎం జగన్‌ స్పష్టీకరణ

విశాలాంధ్ర బ్యూరో`అమరావతి : ఎయిడెడ్‌ స్కూళ్ల స్వాధీనంపై ఒత్తిడి లేదని సీఎం జగన్‌మోహన్‌రెడ్డి స్పష్టంచేశారు. ఈ విష యాన్ని ఆయా విద్యాసంస్థల యాజమాన్యాలకు చెప్పాలని విద్యాశాఖాధికారులను ఆదేశించారు. తాడేపల్లి సీఎం క్యాంప్‌ కార్యాలయంలో విద్యా శాఖపై సోమవారం ఆయన సమీక్షించారు. యాజ మాన్యాలు తమకు అప్పగిస్తే ప్రభుత్వం నడుపుతుం దని, లేకపోతే వారే నడుపుకోవచ్చ న్నారు. ఇదంతా స్వచ్ఛందం అన్న విషయాన్ని యాజమా న్యాలకు చెప్పి, అపోహలు తొలగించాలని సీఎం సూచించారు. ‘అమ్మ ఒడి’ పథకానికి హాజరు అనుసంధానం చేసి కనీసం 75శాతం ఉండేలా చూడాలన్నారు. పిల్లలను చదువులబాట పట్టించాల న్నదే అమ్మ ఒడి ఉద్దేశమని, ఈ స్ఫూర్తిని కొనసా గించాలన్నారు. ఇప్పటివరకు కరోనాతో హాజరును పరిగణనలోకి తీసుకోలేదని, ఈ ఏడాది నుంచి హాజరు నిబంధనను కచ్చితంగా అమలు చేయాలని సీఎం ఆదేశించారు. జూన్‌లో అమ్మ ఒడి, విద్యాకానుక రెండూ విద్యార్థులకు అందించాలని చెప్పారు. ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల కారణంగా పాఠశాలలపై కరోనా ప్రభావం పెద్దగా లేదని, ప్రభుత్వ పాఠశాలల్లో హాజరు భారీగా పెరిగిందని, ప్రస్తుతం 91శాతం ఉన్నట్లు అధికారులు వివరించగా, పిల్లల్ని బడిబాట పట్టించాలన్నదే అమ్మ ఒడి పథకం ప్రధాన ఉద్దేశమని సీఎం పేర్కొన్నారు.
అన్ని స్కూళ్లకూ సీబీఎస్‌ఈ అఫిలియేషన్‌
రాష్ట్రంలోని అన్ని స్కూళ్లకూ సీబీఎస్‌ఈ అఫిలియేషన్‌ తీసుకొచ్చే దిశగా చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశిం చారు. 2024 నాటికి పిల్లలు సీబీఎస్‌ఈ పరీక్షలు రాసే దిశగా ముందుకు సాగాలని, ప్రతి హైస్కూల్‌కు కచ్చితంగా ప్లే గ్రౌండ్‌ ఉండాలని సీఎం స్పష్టం చేశారు. క్రీడా మైదా నం లేనిచోట భూ సేకరణచేసి అందుబాటులోకి తీసుకు రావాలన్నారు. క్రమంగా ప్రీ హైస్కూల్‌ స్థాయి వరకూ క్రీడామైదానం ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రతి పాఠశాలకు నిర్వహణ ఖర్చుల కింద కనీసం లక్ష రూపా యలను వారికి అందుబాటులో ఉంచాలని, దీనివల్ల మరమ్మతులతో పాటు ఏ సమస్య వచ్చినా తీర్చుకునే అవకాశం ఉంటుందని సీఎం చెప్పారు. పాఠశాలల పని తీరుపై ర్యాంకింగ్‌లు ఇస్తామంటూ అధికారులు ప్రతిపాదిం చగా, ఏ మార్పులు తీసుకొచ్చినా ముందుగా టీచర్లతో మాట్లాడాలని సీఎం సూచించారు. స్కూళ్ల నిర్వహణ, మెరుగైన బోధన, నాణ్యత పాటించేందుకు సోషల్‌ ఆడిటింగ్‌ ఉండాలని ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేశారు. సమావేశానికి విద్యాశాఖమంత్రి ఆదిమూలపు సురేష్‌, పాఠ శాల విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి బుడితి రాజశేఖర్‌, మహిళా, శిశు సంక్షేమశాఖ ముఖ్య కార్యదర్శి ఏఆర్‌.అను రాధ, ఆర్థికశాఖ కార్యదర్శి ఎన్‌.గుల్జార్‌, మహిళా శిశు సంక్షేమశాఖ డైరెక్టర్‌ (దిశ స్పెషల్‌ ఆఫీసర్‌) కృతికా శుక్లా, ఎండీఎం అండ్‌ శానిటేషన్‌ డైరెక్టర్‌ బీఎం దివాన్‌, పాఠశాల విద్యాశాఖ కమిషనర్‌ వాడ్రేవు చినవీరభద్రుడు, పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్‌ (ఎస్‌సీఈఆర్‌టీ) బి.ప్రతాప్‌రెడ్డి, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img