Friday, April 19, 2024
Friday, April 19, 2024

ఏపీఆర్‌జేసీ సెట్‌ నోటిఫికేషన్‌ విడుదల

24 వరకు దరఖాస్తుల స్వీకరణ

విశాలాంధ్ర బ్యూరోఅమరావతి: రాష్ట్రంలోని గురుకుల విద్యాలయాల సంస్థ నిర్వహణలో ఉన్న జూనియర్‌ కళాశాలల్లో ఇంటర్‌ మీడియట్‌ ప్రవేశాల కోసం నోటిఫికేషన్‌ విడుదలైంది. ఏపీఆర్‌జేసీ ఉమ్మడి ప్రవేశ పరీక్ష 2023కు ఏప్రిల్‌ 4 నుంచి 24వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించను న్నట్లు గురుకుల విద్యాలయాల సంస్థ కార్యదర్శి ఆర్‌.నర్సింహారావు మంగళవారం ఒక ప్రక టనలో తెలిపారు. ఇంటర్‌ ప్రథమ సంవత్సరం ప్రవేశ పరీక్ష హాల్‌ టికెట్లను మే 12 నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చని తెలిపారు. మే 20న మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పరీక్ష నిర్వహిస్తారని, వీటి ఫలితాలను జూన్‌ 8న ప్రకటిస్తారని తెలిపారు. అనంతరం ఇంటర్‌లో కోర్సుల వారీగా సీట్లను భర్తీ చేసేందుకు తొలివిడత కౌన్సెలింగ్‌ జూన్‌ 12 నుంచి 16 వరకు, జూన్‌ 19 నుంచి 21 వరకు రెండో విడత, జూన్‌ 26 నుంచి 28 వరకు మూడో విడత కౌన్సిలింగ్‌ జరుగుతుందని వెల్లడిరచారు. అలాగే డిగ్రీ కళాశాల ప్రవేశాలకు దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమైందని, 6,7,8 తరగతుల్లో మిగిలిన సీట్లను భర్తీ చేసేందుకు కూడా దరఖాస్తులను ఆహ్వానిస్తున్నామని నర్సింహా రావు తెలియజేశారు. అన్ని తరగతుల్లో ప్రవేశాల కోసం మే 20న ప్రవేశ పరీక్ష జరుగుతుందని, మిగిలిన వివరాలకు ఏపీఆర్‌ఎస్‌ అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించాలని కోరారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img