Friday, April 19, 2024
Friday, April 19, 2024

ఏపీలో విజయ పాల ధర పెంపు

ఏపీలో విజయ పాల ధర పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. రైతుల పాల సేకరణ ధరలు, నిర్వహణ, రవాణా ఖర్చులు పెరగడంతో ఈ నిర్ణయం తీసుకున్నామని ప్రకటనలో తెలిపారు. మార్చి 1 నుంచి విజయ పాల ధర అర లీటరు ప్యాకెట్‌పై రూ. 1 చొప్పున పెరగనుంది. ఆరు రకాల ప్యాకెట్లకు మాత్రమే ఈ ధర వర్తిస్తుందని కృష్ణా మిల్క్‌ యూనియన్‌ ఒక ప్రకటనలో తెలిపింది. పెరుగు, చిన్న పాల ప్యాకెట్లు, ఇతర పాల పదార్థాల విక్రయ ధరల్లో ఎటువంటి మార్పు లేదు. నెలవారీ పాల కార్డుదారులకు మార్చి 9 వరకు పాత ధరలే వర్తిస్తాయని తెలిపారు.అర లీటరు విజయ లోఫ్యాట్‌ (డీటీఎం) ధర రూ. 27 కాగా.. ఎకానమీ (టీఎం) రూ. 29.. అలాగే ప్రీమియం (స్టాండర్డ్‌) రూ. 31.. ఇక స్పెషల్‌ (ఫుల్‌ క్రీమ్‌) రూ. 36, గోల్డ్‌ రూ. 37, టీ-మేట్‌ రూ. 34 అయ్యింది. దేశంలో అన్ని యూనియన్లు రేట్లను పెంచిందని తెలిపారు. అనివార్య పరిస్థితుల్లో పాలు, పాల ఉత్పత్తుల గరిష్ట విక్రయ ధరలను స్వల్పంగా సవరించామని చెబుతున్నారు. సవరించిన ఈ పాల విక్రయ ధరలను విజయ రిటైలర్లు, వినియోగదారులు గమనించి ఎప్పటిలాగే పాడి రైతుల సంస్థ అభివృద్ధికి సహకరించాలన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img