Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

ఆ నలుగురి ఓట్లు టీడీపీకే.. అచ్చెన్నాయుడు, నిమ్మల

ఏపీలో హీట్ పెంచుతున్న ఎమ్మెల్సీ ఎన్నికలు..

ఆత్మప్రభోదానుసారం ఓట్లు వేస్తారంటూ కామెంట్స్

టీడీపీ ఎమ్మెల్యేల సంఖ్య 23 అని గ్రహించకుండా వైఎస్సార్‌సీపీ నేతలు పిచ్చిపెట్టినట్లు మాట్లాడుతున్నారన్నారు ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు . పార్టీకి దూరమైన నలుగురు తెలుగుదేశం ఎమ్మెల్యేలు తప్పు చేశామనే భావనలో ఉన్నారని.. కన్నతల్లి లాంటి పార్టీ వీడి తప్పు చేశామని తమతో చెప్తున్నారన్నారు. వారికి దేవుడు తప్పును సరిదిద్దుకునే అవకాశం మళ్లీ ఇచ్చారని.. వారు అంతరాత్మ ప్రభోదానుసారావు ఓటు వేస్తారని నమ్ముతున్నట్లు చెప్పారు.టీడీపీకి బలం లేకపోయినా పోటీ చేస్తున్నారని వైఎస్సార్‌సీపీ ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని.. టీడీపీకి 23మంది ఎమ్మెల్యేలు ఉన్నారన్నారు. 22 ఓట్లు వేస్తే ఎమ్మెల్సీ గెలుస్తారన్న విషయం వారికి తెలియదా అన్నారు. టీడీపీ నుంచి నలుగురు మారిపోయారన్నారని.. అప్పుడు స్పీకర్ సభలో పార్టీల బలాబలాలను చదవాలని కోరారు. తమకు సంఖ్యాబలం ఉంది కాబట్టే పోటీ చేశాం.. కచ్చితంగా గెలుస్తామన్నారు.వైఎస్సార్‌సీపీలో చాలామంది ఎమ్మెల్యేలు ప్రజాస్వామ్యం అపహాస్యం అవుతుంది, ఎమ్మెల్యేలకు కనీసం గౌరవం లేదు, విలువలు లేని పరిస్థితిని జగన్ తీసుకొచ్చారని అంతర్మదనపడుతున్నారన్నారు. వారంతా ఆత్మప్రభోదానుసారం ఓట్లు వేస్తారని విశ్వసిస్తున్నామని.. అందుకే గెలుస్తామని చెబుతున్నామన్నారు. టీడీపీ అభ్యర్థి కచ్చితంగా విజయం సాధిస్తారని ధీమాను వ్యక్తం చేశారు.మరోవైపు వైఎస్సార్‌సీపీ చెందిన 16 మంది ఎమ్మెల్యేలు ఆత్మ ప్రబోధానుసారం టీడీపీకి ఓట్లు వేస్తారన్నారు ఆ పార్టీ ఎమ్మెల్యేలు నిమ్మల రామానాయుడు , గోరంట్ల బుచ్చయ్య . ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో అంతరాత్మ ప్రభోదానుసారావు వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు తమకు ఓటు వేయబోతున్నారన్నారు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు. టీడీపీ చరిత్ర సృష్టిస్తుందని.. అసంతృప్తితో ఉన్నఎమ్మెల్యేలు తమకు టచ్‌లోనే ఉన్నారన్నారు. పట్టభద్రుల ఎన్నిక తర్వాత వైఎస్సార్‌సీపీ మునిగిపోయే నావ అని వారు గ్రహించారని.. సీక్రెట్ ఓటింగ్‌లో ఎవరు ఎవరికి వేశారో తెలిసే అవకాశమే లేదన్నారు.

వైఎస్సార్‌సీపీలో భయం మొదలైందని.. అందుకే అభద్రతా భావనలో జగన్ క్యాంపులు పెట్టుకున్నారన్నారు ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి. ముఖ్యమంత్రి మీద అసంతృప్తితో ఉన్న అధికార పార్టీ ఎమ్మెల్యేలు తమతో సంప్రదింపులు చేస్తూనే ఉన్నారన్నారు. తాము ఎవ్వరికీ ఎలాంటి హామీ ఇవ్వలేదని.. వారు అంతరాత్మప్రభోదానుసారం ఓటు వేస్తారని భావిస్తున్నామన్నారు. మరోవైపు టీడీపీ అధినేత చంద్రబాబు ఎమ్మెల్యేలతో సమావేశం అయ్యారు. అందరూ కలిసి ఒకేసారి ఓటు వేయనున్నారు. వైఎస్సార్‌సీపీ కూడా టీడీపీకి కౌంటర్ ఇస్తోంది. సంఖ్యా బలం లేకపోయినా అభ్యర్థిని నిలబెట్టారని.. అయినా ఏడు స్థానాల్లో విజయం సాధిస్తామని ధీమాను వ్యక్తం చేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img