Thursday, April 18, 2024
Thursday, April 18, 2024

ఏపీ పదో తరగతి ఫలితాలు విడుదల

ఆంధ్రప్రదేశ్‌ పదో తరగతి పరీక్షా ఫలితాలు విడుదలయ్యాయి. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఫలితాలను విడుదల చేశారు. ఫలితాల్లో బాలికలే పై చేయి సాధించారని చెప్పారు. 6,15,908 మంది పరీక్షలకు హాజరుకాగా.. 4,14,281 మంది విద్యార్థులు పాస్‌ అయ్యారు. మార్కుల రూపంలో ఫలితాలు విడుదల చేశారు మొత్తం 67.26 శాతం మంది ఉత్తీర్ణులయ్యారు. ఈసారి కూడా బాలికలే పైచేయి సాధించారు. బాలికలు 70.70 శాతం, బాలురు 64.02 శాతం ఉత్తీర్ణత సాధించారు. 78.3 శాతంతో ప్రకాశం జిల్లా ప్రథమ స్థానంలో నిలువగా.. 49.7శాతంతో అత్యల్ప స్థానంలో అనంతపురం జిల్లా నిలిచింది. వచ్చే నెల 6 నుంచి 15 వరకు సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నారు. రేపటి నుంచి సప్లిమెంటరీ పరీక్షలకు ఫీజు కట్టే అవకాశం కల్పించారు. ఈ నెల 13 నుంచి ఫెయిల్‌ అయిన విద్యార్ధులకు ప్రత్యేక తరగతులు చేపట్టనున్నారు. 71 పాఠశాలల్లో ఒక్క విద్యార్థి కూడా పాస్‌ కాలేదని మంత్రి బొత్స తెలిపారు. గతంలో మాదిరే ఈసారీ విద్యార్థులకు వచ్చిన మార్కులనే వెల్లడిస్తారు. గ్రేడిరగ్‌ పద్ధతిని తీసేశారు. విద్యాశాఖ ర్యాంకులనూ ప్రకటించదు. ఈ నేపథ్యంలో విద్యాసంస్థలు కూడా తమ దగ్గర చదువుకున్న విద్యార్థులకు ఫలానా ర్యాంకులు వచ్చాయని ప్రచారం చేయకూడదని, అలా చేస్తే కనీసం మూడేళ్ల జైలు శిక్ష పడుతుందని ఇప్పటికే విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img