Friday, April 19, 2024
Friday, April 19, 2024

ఏపీ పిటిషన్‌ మరో ధర్మాసనానికి బదిలీ..

తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న కృష్ణా నదీ జలాల వివాదంపై ఇవాళ సుప్రీం కోర్టులో బుధవారం విచారణ జరిగింది. ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌ మరో ధర్మాసనానికి బదిలీ చేసింది. ఈ మేరకు సీజేఐ ఎన్‌.వి.రమణ నేతృత్వంలోని ధర్మాసనం ఉత్తర్వులు జారీచేసింది. మధ్యవర్తిత్వం ద్వారా సమస్య పరిష్కారం కాదని ఈ వ్యవహారంలో న్యాయపరమైన పరిష్కారం కోరుకుంటున్నట్లు ధర్మాసనానికి ఏపీ ప్రభుత్వం తరపు న్యాయవాదులు తెలిపారు. సీజేఐ ధర్మాసనమే ఈ అంశంపై విచారణ జరుపాలని కేంద్ర ప్రభుత్వం తరపు న్యాయవాది కోరారు. అయితే, కేంద్రం విజ్ఞప్తిని నిరాకరించిన సీజేఐ ధర్మాసనం విచారణను జస్టిస్‌ సూర్యకాంత్‌ బెంచ్‌కు బదిలీ చేస్తూ ఆదేశాలు ఇచ్చారు. ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌పై గత సోమవారం సీజేఐ జస్టిస్‌ ఎన్‌.వి.రమణ నేతృత్వంలోని ధర్మాసనం వాదనలు విన్నది.. మధ్యవర్తిత్వం ద్వారా సమస్య పరిష్కరించుకోవాలని రెండు రాష్ట్రాలకు సీజేఐ సూచించారు. విచారణే కోరుకుంటే పిటిషన్‌ను మరో ధర్మాసనానికి బదిలీ చేస్తానని పేర్కొన్నారు. మధ్యవర్తిత్వ సూచనపై రెండు రాష్ట్రాల న్యాయవాదులు తమ ప్రభుత్వాలతో సంప్రదించి చెప్తామని కోరడంతో విచారణను ధర్మాసనం బుధవారానికి వాయిదా వేసిన విషయం తెలిసిందే.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img