Thursday, April 18, 2024
Thursday, April 18, 2024

ఏపీ ఫైబర్‌నెట్‌ అక్రమాలపై సీఐడీ దర్యాప్తు

రూ.321 కోట్ల స్కామ్‌లో 16 మందిపై ఎఫ్‌ఐఆర్‌

అమరావతి : ఏపీ రాష్ట్ర ఫైబర్‌నెట్‌ లిమిటెడ్‌లో రూ.321 కోట్ల కుంభకోణంపై దర్యాప్తు చేపట్టిన రెండు నెలలకు ఎఫ్‌ఐఆర్‌ను ఆంధ్రప్రదేశ్‌ క్రైం దర్యాప్తు సంస్థ (సీఐడీ) నమోదు చేసింది. ఫైబర్‌ నెట్‌ టెండర్లలో అవినీతి నేపథ్యంలో 16 మందిపై ఎఫ్‌ఐఆర్‌ను న్యాయస్థానానికి సమర్పించింది. గత ప్రభుత్వం టెరా సాఫ్ట్‌వేర్‌కు అడ్డుగోలుగా టెండర్లు కట్టబెట్టినట్లు ఆరోపణలు ఉన్నాయి. తొలిదశ ఆఫ్టికల్‌ ఫైబర్‌ గ్రిడ్‌ టెండర్లలో అవినీతి జరిగిందని తెలిసింది. ఈ క్రమంలో వేమూరి, టెరాసాఫ్ట్‌వేర్‌, అప్పటి అధికారులపై కేసు నమోదైంది. బ్లాక్‌లిస్టులోని కంపెనీకి గత ప్రభుత్వం అవకాశం కల్పించింది. ఫోర్జరీ ఎక్స్‌పీరియన్స్‌ సర్టిఫికెట్‌తో మోసం చేసినట్లు సీఐడీ అధికారులు గుర్తించారు. ఈనెల 9న నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌ ప్రతి శనివారం బయటకు వచ్చింది. 16 మంది పేర్లు, రెండు కంపెనీలను నిందితుల జాబితాలో సీఐడీ పేర్కొంది. ఏపీఎస్‌ఎఫ్‌ఎల్‌ చైర్మన్‌ పి.గౌతం రెడ్డి ఫిర్యాదు నేపథ్యంలో రూ.321 కోట్ల టెండరును వేమూరి హరికృష్ణ ప్రసాద్‌ టెరా సాఫ్ట్‌వేర్‌ లిమిటెడ్‌తో కలిసి అక్రమంగా దక్కించుకున్నట్లు సీఐడీ వెల్లడిరచింది. టెండర్‌ పొందేందుకు అవసరమైన అర్హతలు ఈ కంపెనీకి లేవని ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొంది. వేమూరి హరికృష్ణ ప్రసాద్‌తో పాటు ఏపీకే ఇన్ఫస్ట్రాక్చర్‌ కార్పొరేషన్‌ అప్పటి ఎండీ సాంబశివరావు, టెరా సాఫ్ట్‌వేర్‌ చైర్మన్‌ ఎస్‌ఎస్‌ఆర్‌ కోటేశ్వరరావు, ఎండీ టి.గోపిచంద్‌, మరో కంపెనీ ఆరుగురు డైరెక్టర్లుÑ హిమాచల్‌ ఫ్యూటరిస్టిక్‌ కమ్యూనికేషన్స్‌ లిమిటెడ్‌, కొందరు ప్రభుత్వ అధికారుల పేర్లు ఎఫ్‌ఐఆర్‌లో ఉన్నాయి. ఐపీసీ, అవినీతి నిరోధక చట్టంలోని వేర్వేరు సెక్షన్ల కింద కేసు నమోదు అయింది. ఈ మేరకు నివేదికను ఏసీబీ ప్రత్యేక న్యాయమూర్తికి, స్పెషల్‌ పోలీస్‌ ఎస్టాబ్లిష్‌మెంట్‌ కేసులకి సమర్పించారు. రాష్ట్రంలోని అన్ని ఇళ్లకు ఇంటర్నెట్‌, టెలిఫోన్‌ సేవలను అందించే ఉద్దేశంతో కేంద్రప్రభుత్వ భారత్‌ నెట్‌ ప్రాజెక్టులో భాగంగా ఫైబర్‌ నెట్‌ ప్రాజెక్టు ఏపీలో మొదలైంది. మొదట్లో రూ.3,840 కోట్లను నేషనల్‌ ఆప్టిక్‌ ఫైబర్‌ నెట్వర్క్‌ కింద ఫైబర్‌ నెట్‌ ప్రాజెక్టుకు కేంద్రప్రభత్వం అందించింది. అవినీతిపై దర్యాప్తు జరిపించాలని సీఐడీ ఏడీజీకి శ్రీకాంత్‌ నాగులపల్లి జులై 11న ఉత్తర్వులు జారీచేశారు. దర్యాప్తు అనంతరం పూర్తి వివరాలతో నివేదికను ప్రభుత్వానికి సమర్పించాలని సూచించారు. 2020 జులై 13న విశ్వసనీయ ఉత్తర్వులను రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసినప్పటికీ ఈ కేసును చేపట్టేందుకు సీబీఐ ఆసక్తి కనబర్చలేదు. దీంతో అది రాష్ట్ర సీఐడీకి వెళ్లింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img