Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

ఏపీ సెట్‌ పరీక్షల షెడ్యూలు

మే 15`18 తేదీల్లో ఇంజినీరింగ్‌
22, 23 తేదీల్లో ఫార్మసీ పరీక్షలు
మే 5న ఈసెట్‌

విశాలాంధ్ర బ్యూరోఅమరావతి: ఆంధ్రప్రదేశ్‌లోని వివిధ ఉమ్మడి ప్రవేశ పరీక్షల షెడ్యూల్‌ విడుదలైంది. ఇంజినీరింగ్‌, అగ్రికల్చర్‌, ఫార్మసీ ప్రవేశాలకు నిర్వహించే ఏపీఈఏపీ సెట్‌-2023 పరీక్ష తేదీలను రాష్ట్ర ప్రభుత్వం ఖరారు చేసింది. 202324 విద్యా సంవత్సరానికిగాను పీజీ, యూజీ కోర్సుల్లో ప్రవేశాలకు ఈ ఉమ్మడి ప్రవేశపరీక్షలను నిర్వహించనుంది. ఏపీ ఈఏపీసెట్‌లో భాగంగా మే 15 నుంచి 18 వరకు ఎంపీసీ స్ట్రీమ్‌ఇంజనీరింగ్‌, మే 22, 23 తేదీల్లో బైపీసీ స్ట్రీమ్‌ఫార్మసీ పరీక్షలు నిర్వహించనున్నట్లు ఉన్నత విద్యామండలి బుధవారం ప్రకటించింది. ఈఏపీసెట్‌ దరఖాస్తుకు ఈనెల 11 నుంచి వచ్చే నెల 15 వరకు గడువు ఇచ్చింది. మే 5న ఇంజనీరింగ్‌ కామన్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌ (ఈసెట్‌) నిర్వహించనుండగా, దరఖాస్తుకు మార్చి 10 నుంచి ఏప్రిల్‌ 10 వరకు అవకాశం కల్పించింది. ఎంబీఏ/ఎంసీఏలో ప్రవేశాల కోసం నిర్వహించే ఇంటిగ్రేటెడ్‌ కామన్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌ (ఐసెట్‌) పరీక్షలను మే 24, 25 తేదీల్లో ఖరారు చేయగా, వాటి కోసం దరఖాస్తుకు ఈనెల 20 నుంచి ఏప్రిల్‌ 19 వరకు గడువు ఇచ్చింది. ఈఏపీసెట్‌కు ఈనెల 10న, ఈసెట్‌కు 8న, ఐసెట్‌కు 17న ప్రవేశ ప్రకటనలు జారీచేస్తారు. ఉమ్మడి ప్రవేశ పరీక్షలన్నీ ఆన్‌లైన్లో నిర్వహిస్తారు. పరీక్షల తేదీలు, పరీక్ష రుసుం వివరాలను ఉన్నత విద్యామండలి వెబ్‌సైట్‌లో ఉంచారు. వరుస వారీగా అన్ని పరీక్షలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా తేదీలను నిర్ణయించారు. ఇప్పటికే తెలంగాణలో ఉమ్మడి ప్రవేశ పరీక్షల తేదీలను వెల్లడిరచగా, ఏపీలో ఆలస్యంగా ప్రకటించారు. దీనివల్ల ప్రవేశాలు మరింత జాప్యమయ్యే అవకాశముంది. గతేడాది ఉమ్మడి ప్రవేశాల జాప్యంతో వివిధ రాష్ట్రాలకు ఇంజినీరింగ్‌ కోర్సుల నిమిత్తం విద్యార్థులు వలసలు వెళ్లిపోయారు. దీనిప్రభావంతో ఇంజినీరింగ్‌ సీట్లు మిగిలిపోయాయి.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img