Tuesday, April 16, 2024
Tuesday, April 16, 2024

ఒక్కరోజులో వందకు పైగా ఒమిక్రాన్‌ కేసులు

దేశంలో కరోనా కొత్త వేరియంట్‌ శరవేగంగా విస్తరిస్తోంది. నిన్న ఉదయానికి 236గా ఉన్న ఒమిక్రాన్‌ బాధితుల సంఖ్య తాజాగా 358కి చేరింది. ఒక్కరోజు వ్యవధిలోనే వందకి పైగా ఒమిక్రాన్‌ బారినపడ్డారు. మహారాష్ట్రలో అత్యధికంగా 88 మందికి ఒమిక్రాన్‌ సోకగా, దిల్లీ తర్వాతి స్థానంలో ఉంది. అక్కడ బాధితుల సంఖ్య 67కి చేరింది. మొత్తంగా 114 మంది కోలుకున్నారు. ఇక కోవిడ్‌ సెకండ్‌ వేవ్‌ అనంతరం.. ఇటీవల కేసుల సంఖ్య భారీగా తగ్గిన విషయం తెలిసిందే. రోజూ 10వేలకు తక్కువగా కేసులు నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో (గురువారం) దేశవ్యాప్తంగా 6,650 కేసులు నమోదయ్యాయి. దీంతోపాటు.. ఈ మహమ్మారి కారణంగా నిన్న 374 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం దేశంలో 77,516 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. 576 రోజుల తర్వాత క్రీయాశీల కేసుల సంఖ్య ఈ గణనీయంగా తగ్గినట్లు కేంద్రం వెల్లడిరచింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్యశాఖ శుక్రవారం ఉదయం హెల్త్‌ బులెటిన్‌ను విడుదల చేసింది. దేశంలో మార్చి తర్వాత రికవరీ రేటు గణనీయంగా పెరుగుతూ వస్తోంది. ప్రస్తుతం రికవరీ రేటు 98 శాతానికిపైగా ఉంది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img