Friday, April 19, 2024
Friday, April 19, 2024

ఒక భార్యకు 18 మంది భర్తలు

ఇదీ వైసీపీ దొంగ ఓట్ల ప్రహసనం

తిరుపతిలో ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో నారాయణ

విశాలాంధ్ర-తిరుపతి బ్యూరో: ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని నగ్నంగా రోడ్డుపై నిలబెట్టి అపహాస్యం చేస్తోందని, జగన్‌ అరాచక పాలనకు అంతులేకుండా పోతోందని సీపీఐ జాతీయ కార్యదర్శి డాక్టర్‌ కె.నారాయణ ధ్వజమెత్తారు. నారాయణ బుధవారం తిరుపతిలో ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం చేశారు. ఒక్కొక్క ఇంట్లో 30 ఓట్లు, 11 ఓట్లు నమోదు చేసుకున్న పరిస్థితిని పరిశీలించారు. తిరుపతిలోని యశోదనగర్‌ 18-1- 90/12 నంబరు గల ఖాళీ ప్రదేశంలో 10 దొంగ ఓట్లు, ఒక వలంటీర్‌ ఇంట్లో 12 దొంగ ఓట్లు, సీపీఎం ఆఫీస్‌ పక్కన గల లక్ష్మీ ఇంట్లో 8 దొంగఓట్లు ఉన్నట్లు గుర్తించారు. అనంతరం నారాయణ మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ ప్రజాస్వామ్యాన్ని విస్మరించి రాక్షసపాలన కొనసాగిస్తున్నారని విమర్శించారు. ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ఓటమి భయంతో దొంగఓట్లకు తెరలేపారన్నారు. ద్రౌపదికి ఐదుగురు భర్తని విన్నాం కానీ ఎమ్మెల్సీ ఎన్నికల కోసం ఒక మహిళకు 18మంది భర్తలు ఉన్నట్లుగా జగన్‌ ప్రభుత్వం ఓట్లు నమోదు చేయడం సిగ్గుచేటని మండిపడ్డారు. తిరుపతి నగరంలోనే 7 వేల దొంగ ఓట్లు ఉన్నట్లు పేర్కొన్నారు. దొంగ ఓట్ల నమోదుకు పాల్పడిన అధికారిని ఉరితీయాలన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్‌గా పనిచేసిన ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డి నియోజకవర్గంలో ఈ దొంగ ఓట్ల దందా కొనసాగడం దుర్మార్గమన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో అరాచకాలు సృష్టించి దొంగ ఓట్ల ద్వారా గెలవాలని వైసీపీ ప్రయత్నిస్తోందని మండిపడ్డారు. దొంగ ఓట్లు వేయడానికి వచ్చిన వారిని గుర్తించి కాళ్లు విరగొట్టాలన్నారు. ఎన్ని కుయుక్తులు పన్నినా ఎమ్మెల్సీ ఎన్నికల్లో పీడీఎఫ్‌ అభ్యర్థుల విజయం తథ్యమన్నారు. కార్యక్రమంలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు పి.హరినాథరెడ్డి, జిల్లా కార్యదర్శి మురళి, కార్యవర్గ సభ్యులు రాధాకృష్ణ, ప్రభాకర్‌, విశ్వనాథ్‌, శశి, ప్రజాసంఘాల నాయకులు కాలయ్య, నాగరాజ్‌, బాల, సీపీఎం జిల్లా కార్యవర్గ సభ్యులు మురళి, నగర కార్యదర్శి సుబ్రహ్మణ్యం, జయ, మాధవరెడ్డి, వేణు, బుజ్జి, శ్రీను తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img