Friday, April 19, 2024
Friday, April 19, 2024

ఒమిక్రాన్‌ను తేలిగ్గా తీసుకోవద్దు : డబ్ల్యూహెచ్‌వో

ఒమిక్రాన్‌ శరవేగం విజృంభిస్తోంది. కొందరు ఇది సాధారణ జలుబులాంటిదని అభిప్రాయపడుతున్నారు. అయితే ఒమిక్రాన్‌ వేరియంట్‌ను తేలిగ్గా తీసుకోవద్దని ప్రపంచ ఆరోగ్యసంస్థ హెచ్చరించింది. ఇది చాలా వేగంగా వ్యాప్తి చెందుతోందని, త్వరలోనే డెల్టాను అధిగమిస్తుందని వెల్లడిరచింది. తక్కువ సమయంలో ఈ వేరియంట్‌ కేసులు రెట్టింపు అవుతున్నాయని, ఇది చాలా సులభంగా రోగనిరోధకశక్తిని తప్పించుకుంటోందని పేర్కొంది. ‘దీన్ని కొందరు ఏదో జలుబులా భావిస్తున్నారు. దీని తీవ్రత అంతగా ఉండదని భావిస్తున్నారు. ఇది చాలా ప్రమాదం. ఈ వేరియంట్‌తో ఆసుపత్రులు పాలవుతున్నవారూ అధికంగా ఉన్నారు.ఇప్పటికే రోగాలున్నవారు, వృద్ధులు, టీకాలు తీసుకోనివారిపై దీనీ ప్రభావం తీవ్రంగా ఉండనుంది.’ అని డబ్ల్యూహెచ్‌వో సీనియర్‌ శాస్త్రవేత్త మరియా వాన్‌ కెరావో తెలిపారు. అలాగే ే ఒమిక్రాన్‌ వేరియంట్‌ను తేలిగ్గా తీసుకోవద్దని నీతి ఆయోగ్‌ సభ్యుడు (హెల్త్‌) డాక్టర్‌ వీకే పాల్‌ హెచ్చరించారు. ఒమిక్రాన్‌ సాధారణ జలుబుగా భావించడం సరికాదన్నారు. పలు దేశాల్లో ఆరోగ్య వ్యవస్థ కుప్పకూలడానికి ఒమిక్రాన్‌ కారణమయ్యిందని.. దీన్ని విస్మరించవద్దని సూచించారు. ఒమిక్రాన్‌ను ఎదుర్కొనేందుకు వ్యాక్సినేషన్‌, మాస్క్‌లు తప్పనిసరని.. ఈ సామాజిక బాధ్యతను ప్రతి ఒక్కరూ గుర్తించాలన్నారు. వ్యాక్సినేషన్‌ భారీ స్థాయిలో జరిగినందునే ఆస్పత్రుల్లో చేరే వారి సంఖ్య తగ్గినట్లు వివరించారు. భారత్‌ కోవిడ్‌-19ను ఎదుర్కోవడంలో వ్యాక్సినేషన్‌ కీలక పాత్ర పోషిస్తున్నట్లు వ్యాఖ్యానించారు. ఇంకా వ్యాక్సిన్లు తీసుకోనివారు.. తక్షణం తీసుకోవాలని కోరారు. హోం ఐసొలేషన్‌లో మందుల అధిక వినియోగం, దుర్వినియోగం ప్రభుత్వానికి ఆందోళన కలిగిస్తున్నట్లు చెప్పారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img