Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

ఒమిక్రాన్‌ కట్టడికి వ్యాక్సినేషన్‌ ఒక్కటే మార్గం

డాక్టర్‌ సౌమ్య స్వామినాథన్‌
కరోనా వైరస్‌ కొత్త ఒమిక్రాన్‌ వేరియంట్‌ కేసులు పెరుగుతున్న దృష్ట్యా, ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్‌ సౌమ్య స్వామినాథన్‌, కోవిడ్‌ 19 వ్యాక్సినేషన్‌ను ప్రపంచవ్యాప్తంగా బలోపేతం చేయాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్‌ సౌమ్య స్వామినాథన్‌ పిలుపునిచ్చారు. ఒమిక్రాన్‌ వేరియంట్‌ ప్రపంచవ్యాప్తంగా వేగంగా పెరుగుతోందని, దీనిని నివారించాలంటే పూర్తిస్థాయి వ్యాక్సినేషన్‌ ఒక్కటే మార్గమన్నారు.వ్యాక్సిన్‌ తీసుకున్న వారితోపాటు తీసుకోని వారికి కొత్త వేరియంట్‌ ఓమిక్రాన్‌ సోకుతుందన్నారు. అయినప్పటికీ, టీకాలు ఇంకా ప్రభావవంతంగా ఉన్నాయని నిరూపిస్తున్నట్లు ఆమె చెప్పారు. ఎందుకంటే అనేక దేశాలలో సంఖ్యలు వేగంగా పెరుగుతున్నప్పటికీ, వ్యాధి తీవ్రత కొత్త స్థాయిలకు చేరుకోలేదన్నారు. వాక్సినేషన్‌తో కరోనా మరణాల సంఖ్య, ఆసుపత్రిలో చేరే సంఖ్య కూడా తగ్గుతుందని అన్నారు. కాబట్టి అట్టడుగున ఉన్న ప్రజలు కూడా టీకాను మరింత పెంచాల్సిన అవసరం ఉందని చెప్పారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img