Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

ఒమిక్రాన్‌ కలవరం..నేడు ప్రధాని అధ్యక్షతన సమీక్ష

ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో విజృంభిస్తోన్న కరోన కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్‌ క్రమంగా భారత్‌లోనూ తన ఉనికిని చాటుతోంది. చాప కింద నీరులా ఒమిక్రాన్‌ విస్తరిస్తోంది. ఇప్పటికే 16 రాష్ట్రాలు/ కేంద్రపాలిత ప్రాంతాలకు ఈ వేరియంట్‌ విస్తరించింది. ఈ తరుణంలో కేంద్రం అప్రమత్తమైంది. దేశంలో నెలకొన్న కొవిడ్‌ పరిస్థితులు, వైద్యపరంగా సంసిద్ధత, టీకా కార్యక్రమం వంటి వాటిపై ప్రధాని నరేంద్రమోదీ ఇవాళ ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు.ఈ సాయంత్రం 6.30 గంటలకు సమావేశం మొదలవుతుందని కేంద్ర ప్రభుత్వ వర్గాలు వెల్లడిరచాయి. ఇప్పటివరకు దేశంలో 236 మంది ఒమిక్రాన్‌ బారినపడ్డారని, 104 మంది కోలుకున్నారని ఈ ఉదయం కేంద్రం వెల్లడిరచింది. అత్యధికంగా మహారాష్ట్రలో బాధితుల సంఖ్య 65కి చేరింది. దేశ రాజధాని దిల్లీలో ఆ సంఖ్య 64గా ఉంది. కాగా ఒమిక్రాన్‌ వేరియంట్‌ కేసులు అధికంగా ఉన్న ప్రాంతాల్లో నైట్‌ కర్ఫ్యూలు విధించాలని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు ఈ నెల 20న మార్గదర్శకాలు జారీచేసింది. ఆయా ప్రాంతాలను కంటైన్‌మెంట్‌ జోన్‌లుగా ప్రకటించాలని సూచించింది. కాంటాక్ట్‌ ట్రేసింగ్‌, ట్రాకింగ్‌, ట్రీట్‌మెంట్‌ విషయాల్లో కచ్చితత్వంలో ఉండాలని ఆరోగ్యశాఖ అధికారులను ఆదేశించింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img