Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

ఒమిక్రాన్‌ తీవ్రతను గుర్తించడం కష్టతరంగా ఉంది

ప్రస్తుతం యువతకే ఎక్కువ సోకుతోంది
దక్షిణాఫ్రికా శాస్త్రవేత్తలు వెల్లడి

కరోనా కొత్త వేరియెంట్‌ ఒమిక్రాన్‌ తీవ్రత ఏ విధంగా ఉంటుందో గుర్తించడం కష్టతరంగా ఉందని , ఈ వేరియంట్‌ వ్యాధికారక క్రిములతో పోరాడగలిగే యువకులను కూడా ప్రభావితం చేసిందని దక్షిణాఫ్రికా శాస్త్రవేత్తలు వెల్లడిరచారు. ‘ప్రస్తుతం ఈ కొత్త వేరియంట్‌ ఎక్కువగా యువతకే సోకుతుంది. వారికి రోగనిరోధకశక్తి ఎక్కువగా ఉండటంతో తీవ్రత తెలియట్లేదు. ఇప్పుడు ఈ వైరస్‌ పెద్దవారికి సోకుతుండటం గమనించాం. అయితే వారిలో తీవ్రమైన సమస్యలు కొన్ని వారాల వరకు కనిపించకపోవచ్చు.’ అని తెలిపారు. టీకాలు వేయించుకోని వారిలో ఈ కొత్త వేరియెంట్‌ వేగంగా వ్యాపిస్తుందని తెలిపారు. కొంతకాలం వైరస్‌ను మోసుకెళ్లిన తర్వాత ప్రజలు అనారోగ్యానికి గురవుతున్నారని వెల్లడిరచారు. పాశ్చాత్య దేశాలతో పోలిస్తే దక్షిణాఫ్రికాలో కొవిడ్‌ టీకా రేటు తక్కువగా ఉంది. ఆ దేశంలో గత 24 గంటల్లో వెలుగుచూసిన ఒమైక్రాన్‌ కొవిడ్‌ కేసుల సంఖ్య రెట్టింపు పెరిగి 8,561కి చేరిందని నేషనల్‌ ఇన్స్టిట్యూట్‌ ఫర్‌ కమ్యూనికేబుల్‌ డిసీజెస్‌ తెలిపింది. కరోనా కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్‌ వెలుగులోకి రావడంతో పలు ప్రపంచ దేశాలు దక్షిణాఫ్రికా దేశాలపై ప్రయాణ నిషేధాన్ని విధించాయి.
కాగా ఒమిక్రాన్‌ తీవ్రతను గుర్తించేందుకు ప్రయత్నిస్తున్న శాస్త్రవేత్తలు మరో కొత్త విషయాన్ని వెల్లడిరచారు. ఒమిక్రాన్‌ సోకిన వ్యక్తుల్లో రోగనిరోధకశక్తి తగ్గుతున్నట్లు తేలిందని వెల్లడిరచారు. అయితే కొవిడ్‌ వ్యాక్సిన్లు తీసుకున్నవారికి రక్షణ లభిస్తుందని చెప్పారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img