Friday, April 19, 2024
Friday, April 19, 2024

ఒమిక్రాన్‌ ప్రమాద ఘంటికలు..కొత్త కేసుల్లో భారీ పెరుగుదల

దేశంలో గత కొన్ని రోజులుగా పదివేల దిగువనే నమోదవుతున్న కరోనా కేసులు తాజాగా 16వేలకు పైగా చేరాయి. మరో వైపు ఒమిక్రాన్‌ కేసులు కూడా భారీగా పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. నిన్న ఒక్కరోజే 16,764 కొవిడ్‌ కేసులు నమోదు కాగా, ఒమిక్రాన్‌ కేసుల సంఖ్య 1270కి పెరిగింది. ఒక్కరోజులోనే కొత్త వేరియంట్‌ కేసులు 30 శాతం మేర పెరిగాయి. ఇప్పటివరకూ 23 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఒమిక్రాన్‌ కేసులు నమోదయ్యాయి. మహారాష్ట్రలో 450, ఢల్లీిలో 320, కేరళలో 109, గుజరాత్‌ 97, రాజస్థాన్‌ 69, తెలంగాణ 62, తమిళనాడులో 46, కర్ణాటక 34 ఒమిక్రాన్‌ కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకూ భారత్‌లో ఒమిక్రాన్‌ నుంచి 374 మంది కోలుకున్నట్టు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడిరచింది.కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడిరచిన గణాంకాల ప్రకారం, గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 16,764 మందికి వైరస్‌ సోకింది. మహారాష్ట్ర, దిల్లీ, పశ్చిమబెంగాల్‌లో కరోనా ఉధృతి అధికంగా ఉంది. ప్రస్తుతం క్రియాశీల కేసులు 91,361కి చేరాయి.నిన్న 7,585 మంది కోలుకున్నారు. మొత్తం కేసులు 3.48 కోట్లకు చేరగా, 3.42 కోట్లమంది కరోనా నుంచి బయటపడ్డారు. ఇక గడిచిన 24 గంటల్లో 220 మంది మరణించారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 4,81,080గా ఉంది. ఇప్పటివరకు 144 కోట్లకు పైగా టీకా డోసులు పంపినీ అయ్యాయని కేంద్రం వెల్లడిరచింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img