Thursday, April 18, 2024
Thursday, April 18, 2024

కన్నీరెందుకు?..స్ఫూర్తిని నింపారు..

మహిళల హాకీ జట్టుతో ఫోన్‌లో మాట్లాడిన ప్రధాని మోదీ
టోక్యో ఒలింపిక్స్‌ భారత మహిళల హాకీ జట్టు దేశానికి పతకాన్ని అందించే అవకాశాన్ని త్రుటిలో చేజార్చుకోవడాన్ని తట్టుకోలేక కన్నీరుపెట్టుకున్నారు. వారి ఆవేదనను అర్థం చేసుకున్న ప్రధాని మోదీ ఒలింపిక్స్‌లో మీరు సాధించిన విజయాలు.. మరింత మంది అమ్మాయిలు క్రీడల్లో అడుగు పెట్టేందుకు స్ఫూర్తినిస్తాయి అంటూ మోదీ ట్వీట్‌ చేశారు. అంతేకాకుండా హాకీ జట్టు కోచ్‌కు ఫోన్‌ చేసిన ప్రధానమంత్రి నరేంద్రమోదీ కన్నీరు పెట్టుకోవద్దంటూ వారిని ఊరడిరచారు. ‘పతకం కోసం మీరు చిందించిన స్వేదం.. ఈ దేశానికి ప్రేరణ అవుతుంది. కోచ్‌ సహా, జట్టు సభ్యులందరికీ అభినందనలు తెలియజేస్తున్నా’ అని మోదీ చెప్పారు. ఫోన్‌ స్పీకర్‌ ఆన్‌ చేయగా అందరూ ఒక దగ్గరికి చేరి ప్రధాని చెప్పింది విన్నారు. ఆ సమయంలో ఫోన్‌ చుట్టూ ఉన్న వారు నిశ్శబ్దంగా ఉండిపోయారు. వారిలో కొందరు కన్నీరు ఆపుకోలేకపోయారు. ఏడవొద్దంటూ మోదీ వారిని ఊరడిరచారు. ‘మీ మనసులో నిండుకున్న మీ బాధ నాకు వినిపిస్తోంది. మిమ్మల్ని చూసి దేశం గర్విస్తోంది. నిరుత్సాహం వద్దు. భారత్‌కు గుర్తింపు అయిన హాకీకి మీ ప్రదర్శన కారణంగా దశాబ్దాల తర్వాత మళ్లీ పునర్‌వైభవం లభించింది.’ అని వారికి ధైర్యం చెప్పారు. అలాగే నవనీత్‌ కౌర్‌ ఆరోగ్యంపైనా మోదీ ఆరా తీశారు. వందన కటారియా, సలీమా ప్రదర్శనపై ప్రశంసలు కురిపించారు. ఎన్నో అంచనాలతో శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో మహిళల హాకీ టీమ్‌ 3-4 తేడాతో ఓడిపోయింది. స్వల్ప తేడాతో పతకాన్ని చేజార్చుకుంది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img