Wednesday, April 24, 2024
Wednesday, April 24, 2024

కరోనా కొత్త కేసులు 7,974 ..ఒమిక్రాన్‌ కేసులు 68

దేశంలో కరోనా వ్యాప్తి కట్టడిలోనే ఉన్నా..కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్‌ కలవరపెడుతోంది. ఇది క్రమంగా పలు రాష్ట్రాలకు వ్యాపిస్తోంది. ఒమిక్రాన్‌ కేసుల సంఖ్య 68కి చేరింది. మహారాష్ట్రలో అత్యధికంగా 32 మంది కొత్త వేరియంట్‌ బారినపడ్డారు. గురువారం కేంద్ర ఆరోగ్యశాఖ ఈ గణాంకాలను వెల్లడిరచింది. దేశంలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 7,974 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇది నిన్నటికంటే 14 శాతం అధికమని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడిరచింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3,47,18,602కు చేరింది.కరోనా నుంచి కోలుకుని 7,948 మంది డిశ్చార్జ్‌ అవగా… 343 మంది మృతి చెందారు. ప్రస్తుతం 87,245 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. అలాగే దేశవ్యాప్తంగా కోలుకున్న వారి సంఖ్య 3,41,54,879గా ఉంది. ఇప్పటి వరకు కరోనాతో 4,76,478 మంది మృత్యువాతపడ్డారు. . ఇప్పటివరకు 135.25 కోట్ల వ్యాక్సిన్‌ డోసులను పంపిణీ చేశామని, బుధవారం ఒక్కరోజే 68,89,025 మందికి టీకాలు ఇచ్చామని తెలిపింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img