Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

కరోనా ఫోర్త్‌వేవ్‌ ఉండకపోవచ్చు

ప్రముఖ వైరాలజిస్ట్‌ డాక్టర్‌ టి.జాకోబ్‌ జాన్‌
దేశంలో గత రెండేళ్ల నుంచి కరోనా వైరస్‌ రకరకాల రూపాలను సంతరించుకుంటూ మానవజాతిని వణికిస్తూనే ఉంది. సెకండ్‌వేవ్‌లో డెల్టా వేరియంట్‌ థర్డ్‌వేవ్‌లో ఒమిక్రాన్‌తో ప్రజల జీవితాలను అల్లకల్లోలం చేసింది. ఇప్పుడిప్పుడే జనం జీవితానికి అలవాటు పడుతున్నారు. అయితే ఫోర్త్‌వేవ్‌పై కలవరపెడుతూనే ఉంది. ఈ నేపథ్యంలో దేశంలో కొవిడ్‌-19 నాలుగో వేవ్‌ ఉండకపోవచ్చని ప్రముఖ వైరాలజిస్ట్‌ డాక్టర్‌ టి.జాకోబ్‌ జాన్‌ తెలిపారు.భారత వైద్య పరిశోధన మండలికి చెందిన వైరాలజీ అడ్వాన్స్‌డ్‌ రీసెర్చ్‌ సెంటర్‌కు గతంలో డైరెక్టర్‌గా పనిచేసిన డాక్టర్‌ టి జాకబ్‌ జాన్‌ ‘పీటీఐ’ వార్తాసంస్థతో మాట్లాడుతూ పలు కీలకాంశాలను వెల్లడిరచారు. భారతదేశంలో కోవిడ్‌ థర్డ్‌ వేవ్‌ ముగిసిందని.. పూర్తిగా భిన్నమైన వేరియంట్‌ వస్తే తప్ప దేశంలో ఫోర్త్‌వేవ్‌ ఏర్పడదని తెలిపారు. కొవిడ్‌ మరోసారి ఎండెమిక్‌ దశకు చేరిందని స్పష్టం చేశారు. అంతేకాదు ఆల్ఫా, బీటా, గామా, ఒమిక్రాన్‌ రకాలకు భిన్నంగా వ్యవహరించే వేరియంట్‌ ఏదైనా పుట్టుకొస్తే తప్ప ఫోర్త్‌వేవ్‌ దేశంలో రాదని ఆయన ధీమా వ్యక్తంచేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img