Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

కరోనా.. మరో వేవ్‌ రావొచ్చు…

డబ్ల్యూహెచ్‌వో ముఖ్య శాస్త్రవేత్త డాక్టర్‌ సౌమ్య స్వామినాథన్‌ వెల్లడి
కరోనా వైరస్‌ పూర్తిగా మన అదుపులోకి వచ్చింది అనుకుంటున్న తరుణంలో ఒమిక్రాన్‌ సబ్‌ వేరియంట్‌ ఎక్స్‌బీబీ కలవరం పుట్టిస్తోంది. ఇది మరోవేవ్‌కు దారితీయొచ్చని ప్రపంచ ఆరోగ్య సంస్థ ముఖ్య శాస్త్రవేత్త డాక్టర్‌ సౌమ్య స్వామినాథన్‌ వెల్లడిరచారు. అభివృద్ధి చెందుతున్న దేశాల టీకా తయారీదారుల నెట్‌వర్క్‌ వార్షిక సాధారణ సమావేశానికి ఆమె ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. ఈ సందర్భంగా ఆమె సబ్‌ వేరియంట్‌ పై ఆందోళన వ్యక్తం చేశారు.ప్రస్తుతం 300కు పైగా ఒమిక్రాన్‌ సబ్‌వేరియంట్లు ఉన్నాయని, వాటిల్లో ముఖ్యంగా ఎక్స్‌బీబీ ఆందోళనకు గురిచేస్తోందన్నారు. రోగనిరోధక శక్తిని ఏమార్చే గుణం దీనికి ఉందని, కొన్ని దేశాల్లో మూడో వేవ్‌కు ఆస్కారం ఉందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అలాగే బీఏ5, బీఏ1 ఉత్పరివర్తనాలను కూడా పరిశీలిస్తున్నామని, వైరస్‌ పరిణామం చెందుతున్న కొద్దీ అది మరింత ఎక్కువగా వ్యాప్తి చెందే ప్రమాదం ఉందని సౌమ్య స్వామినాథన్‌ హెచ్చరించారు. %శదీదీ% వల్ల వ్యాధి తీవ్రత ఎక్కువగా ఉందన్న సమాచారం మాత్రం ఇంతవరకు రాలేదన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img