Tuesday, April 16, 2024
Tuesday, April 16, 2024

కరోనా వ్యాక్సినేషన్‌లో సరికొత్త రికార్డు

ఒక్క రోజే 2.5 కోట్ల మందికి టీకాలు
కరోనా వ్యాక్సినేషన్‌లో భారత్‌ సరికొత్త రికార్డు సృష్టించింది. శుక్రవారం దేశవ్యాప్తంగా 2.5 కోట్ల మందికి కొవిడ్‌ టీకాను వేశారు. దీంతో ఇప్పటివరకు చైనా పేరుతో ఉన్న ఒక్కరోజులో అత్యధిక టీకాలు పంపిణీ చేసిన రికార్డును భారత్‌ తుడిపివేసింది.చారిత్రాత్మక ఫిగర్‌ను అందుకున్నట్లు నిన్న అర్థరాత్రి 11.58 నిమిషాలకు కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్సూక్‌ మాండవీయ తన ట్విట్టర్‌లో ఈ విషయాన్ని వెల్లడిరచారు. ప్రధాని మోదీ కూడా ట్వీట్‌ చేస్తూ.. రికార్డు స్థాయిలో వ్యాక్సినేషన్‌ జరిగిన తీరు పట్ల ప్రతి భారతీయుడు గర్వంగా ఉన్నట్లు చెప్పారు. నిజానికి శుక్రవారం మధ్యాహ్నం ఒంటి గంట వరకు కోటిన్నర మందికి కోవిడ్‌ టీకా ఇచ్చేశారు. అయితే ఒక్క రోజులోనే అత్యధిక సంఖ్యలో టీకాలు ఇచ్చిన దేశాల్లో చైనా కూడా ఉంది. జూన్‌ నెలలో ఆ దేశం ఒకే రోజు 2.47 కోట్ల మందికి టీకాలు ఇచ్చింది.
శుక్రవారం సాయంత్రం వరకు ఇండియాలో ఒకే రోజు వ్యాక్సినేషన్‌ రెండు కోట్లు దాటినట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థకు చెందిన సౌత్‌ ఈస్ట్‌ ఏషియా ఆఫీసు తన ట్వీట్‌లో తెలిపింది. మరో మైలురాయిని అందుకున్న భారత్‌కు డబ్ల్యూహెచ్‌వో కంగ్రాట్స్‌ తెలిపింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img