Wednesday, April 24, 2024
Wednesday, April 24, 2024

కర్ణాటక ఈద్గా మైదానంలో గణేశ్‌ ఉత్సవాలు వద్దు

సుప్రీంకోర్టు తీర్పు

న్యూదిల్లీ / బెంగళూరు : కర్ణాటక ఈద్గా మైదానంలో గణేశ్‌ ఉత్సవాలను నిర్వహించవద్దని సర్వోన్నత న్యాయస్థానం మంగళ వారం తీర్పు వెలువరించింది. చతుర్థి వేడుకల నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతివ్వడంపై కర్ణాటక వక్ఫ్‌ బోర్డు అభ్యంతరం వ్యక్తం చేసింది. దీనిపై సుప్రీంకోర్టుకు వెళ్లింది. సుప్రీం త్రిసభ్య ధర్మాసనం కేసును విచారించడంతో ఈ వివాదం కొలిక్కి వచ్చింది. మంటపాలకు అనుమతివ్వడానికి రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడిచేయగా సుప్రీంకోర్టు తాజా తీర్పు చర్చనీయాంశంగా మారింది. గణేశ్‌ మండపాల ఏర్పాటుకు ప్రభుత్వం అనుమతి ఇవ్వవచ్చు అని రాష్ట్ర హైకోర్టు పేర్కొనగా దీనిపై వక్ఫ్‌ బోర్డు సుప్రీంకోర్టుకు వెళ్లింది. 200 ఏళ్లుగా ఈ స్థలంలో ఇటువంటి మతపరమైన కార్యక్రమాలను నిర్వహించలేదని వాదించింది. దీంతో మధ్యంతర ఉత్తర్వులను సుప్రీం త్రిసభ్య ధర్మాసనం జారీ చేసింది. వేడుకల కోసం మైదానాన్ని వాడవద్దని స్పష్టంచేసింది. అయితే ఈ స్థలం ఎవరిది? రాష్ట్ర ప్రభుత్వం పరిధిలోనిదా లేక వక్ఫ్‌ బోర్డుకు చెందినదా అన్నది హైకోర్టు విచారణలో ఉంది. వక్ఫ్‌బోర్డు తరపున దుశ్యంత్‌ దవే సుప్రీంకోర్టులో వాదనలు వినిపించారు. ‘మతపర మైన మైనారిటీల హక్కులను ఈ విధంగా కాల రాయొద్దు. ఈ స్థలంలో ఏ మతానికి సంబంధించిన కార్యక్రమాలను నిర్వహించలేదు. చట్ట ప్రకారం ఇది వక్ఫ్‌బోర్డు స్థలం. ఆకస్మికంగా 2022లో వివాదా స్పద భూమిగా సృష్టించి… గణేశ్‌ ఉత్సావాలు నిర్వహిం చాలని కోరుకుంటున్నారు’ అని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున న్యాయవాది వాదనలు వినిపిస్తూ ‘ఇక్కడేమీ శాశ్వత కట్టడం ఉండడు. రెండు రోజుల కోసం ప్రభుత్వ ఆధ్వర్యంలో ఆలయం ఉంటుంది’ అని చెప్పారు. ఇందుకు స్పందనగా బాబ్రీ మసీదు వ్యవహారాన్ని వక్ఫ్‌ బోర్డు న్యాయవాది గుర్తుచేశారు. ‘నాటి యూపీ సీఎం బాబ్రీ మసీదు విషయంలోనూ ఇటువంటి హామీనే ఇచ్చారు. కానీ తర్వాత ఏమి జరిగిందో అందరికీ తెలుసు’ అని 1992లో మసీదు విధ్వంసాన్ని ఉద్దేశించి అన్నారు. ప్రస్తుతం ఆ స్థలంలో రామ మందిర నిర్మాణం జరుగుతున్న విషయం విదితమే. కర్ణాటక వక్ఫ్‌ బోర్డుకు చెందిన ఈద్గా మైదానంలో గతంలో ఇటువంటి కార్యక్ర మాలను నిర్వహించారా అని సుప్రీం కోర్టు ప్రశ్నిం చగా ప్రభుత్వ న్యాయ వాది ముకుల్‌ రోహత్గీ స్పందిస్తూ ‘అప్పటి పరిస్థితులకు.. ఇప్పుడు పండగ నిర్వహణకు ముడి పెట్టడం ఏమిటి అని ప్రశ్నిం చారు. 200 ఏళ్లుగా ఈ స్థలాన్ని పిల్లల ఆట మైదానంగా వాడుతున్నారని, రెవెన్యూ పత్రాలన్నీ రాష్ట్ర ప్రభుత్వం పేరిట ఉన్నాయని చెప్పారు. దిల్లీలో దసరా సందర్భంగా దిష్టిబొమ్మల దహనాన్ని అన్ని చోట్ల నిర్వహిస్తారని, ఇది హిందువుల పండగ.. నిర్వహించవద్దు అని ప్రజలు అంటారా? మనం కాస్త విశాల దృక్పథంతో ఉండాలి. గుజరాత్‌లో వీధులన్నీ పండుగ కోసం మూసివేస్తారు. రెండు రోజుల కోసం గణేశ్‌ చతుర్థి నిర్వహణకు అనుమతి ఇస్తే ఏమవు తుంది? అని వాదించారు. దవే స్పందిస్తూ ‘మైనారీ టీలు తమ ప్రార్థనలను నిర్వహించేందుకు అనుమతి నిచ్చే ఏదైన ఆలయం మన దేశంలో ఉందంటారా!’ అని వ్యాఖ్యానించారు. వక్ఫ్‌ చట్టం 1995 ప్రకారం ప్రభుత్వ సంస్థలు స్వాధీనం చేసుకున్న వక్ఫ్‌ ఆస్తులను వక్ఫ్‌బోర్డుకు తిరిగి ఇచ్చేయాలని అన్నారు. ఈ భూమి రాష్ట్ర ప్రభుత్వ అధికార పరిధిలోకి రాదన్నారు. వచ్చే ఏడాది ఎన్నికలు జరగనున్న దృష్ట్యా ముస్లింల స్థలంలో హిందూ పండగ నిర్వహించే ప్రయత్నం జరుగుతోందని రాష్ట్ర ప్రభుత్వ రాజకీయ ఉద్దేశాలపై వక్ఫ్‌బోర్డు అనుమానం వ్యక్తంచేసింది. 2023లో బృహత్‌ బెంగళూరు మహా నగర పాలికే (బీబీఎంపీ) ఎన్నికలు జరగనున్నాయి. బోర్డు తరపు న్యాయవాదుల్లో కపిల్‌ సిబల్‌ ఉన్నారు. ఇక్కడ ఏం జరుగుతోంది. దీనిని మీరు ఆపాలి అని కోర్టును ఆయన కోరారు. ఈ వ్యవహారాన్ని ఎల్లుండి విచారించవచ్చు అని కర్ణాటక ప్రభుత్వం చేసిన సూచనను న్యాయస్థానం తోసిపుచ్చింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img