Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

కర్ణాటక ఎన్నికల షెడ్యూల్ ఇదే.. తొలిసారి ఓట్ ఫ్రమ్ హోం అవకాశం

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు ముహూర్తం ఖరారైంది. ఎన్నికల నిర్వహణకు ఈసీ షెడ్యూల్‌ను ప్రకటించింది. ఒకే విడతలో కర్ణాటక ఎన్నికలు నిర్వహించాలని ఈసీ నిర్ణయించింది. ఏప్రిల్ 13న నోటిఫికేషన్ విడుదల చేయనుండగా.. ఏప్రిల్ 20 వరకు నామినేషన్లు దాఖలు చేసేందుకు అవకాశం కల్పించారు. ఏప్రిల్ 21వ తేదీన నామినేషన్లను పరిశీలించనుండగా.. అభ్యర్థులు నామినేషన్లను ఉపసంహరించుకునేందుకు 24వ తేదీ వరకు గడువు విధించారు. మే 10న పోలింగ్ జరగనుండగా.. మే 13న కౌంటింగ్ నిర్వహించి ఫలితాలను వెల్లడించనున్నారు. కర్ణాటకలో మొత్తం 224 అసెంబ్లీ స్థానాలు ఉండగా.. తొలిసారి ఓట్ ఫ్రమ్ హోమ్ విధానం ప్రవేశపెట్టనున్నారు. ఈ విధానం ద్వారా ఇంటి నుంచే ఓటు వేసే అవకాశం కల్పించనున్నారు. 80 ఏళ్లు పైబడిన సీనియర్ సిటిజన్లు, దివ్యాంగులకు మాత్రమే ఓట్ ఫ్రమ్ హోం అవకాశం ఇవ్వనున్నారు. కర్ణాటకలో మొత్తం 5.21 కోట్ల మంది తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. మే24తో కర్ణాటక అసెంబ్లీ పదవీకాలం ముగియనుంది. దీంతో ఈసీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదల చేసింది. ఎన్నికలకు మొత్తం 58,282 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్లు ఈసీ వెల్లడించింది. ఇందులో 41,312 మంది ట్రాన్స్‌జెండర్లు ఓటు హక్కు కలిగి ఉన్నారు. కర్ణాటకలో 36 ఎస్సీ, 15 ఎస్టీ స్థానాలు ఉన్నాయి. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి 104 స్థానాలు రాగా.. కాంగ్రెస్‌కు 78 సీట్లు, జేడీఎస్‌కు 37 సీట్లు వచ్చాయి. అలాగే కర్ణాటక ప్రజ్ఝావంత జనతా పార్టీ, బహుజన్ సమాజ్ వాదీ పార్టీ చెరో సీటు గెలుచుకోగా.. ఒకరు ఇండిపెండెంట్ అభ్యర్థి విజయం సాధించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img