Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

కలగానే హైకోర్టు?

విశాలాంధ్ర – బ్యూరో`కర్నూలు: కర్నూలు జిల్లా ప్రజలకు హైకోర్టు కలగా మిగలనుందా అంటే ప్రస్తుతం ఉన్న పరిస్థితులు చూస్తుంటే అవుననే సమాధానం వస్తోంది. కర్నూలులో వైసీపీ అధ్వర్యంలో నిర్వహించిన రాయలసీమ గర్జనలో ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి కర్నూలులో న్యాయరాజధాని ఏర్పాటు చేస్తున్నామని, జగన్నాథగట్టుపై హైకోర్టు నిర్మాణం చేపడుతున్నామని కర్నూలు నగరానికి చుట్టూ 10 కిలోమీటర్లు ఈ హైకోర్టు కానవస్తుందని చెప్పారు. కానీ మంగళవారం బెంగళూరులో జరిగిన పారిశ్రామిక వేత్తల సదస్సులో కర్నూలు న్యాయరాజధాని కాదని, హైకోర్టు ఉంటుందని మాటమార్చడంపై ప్రజలు ఆందోళన చెందుతున్నారు. మంత్రులు ఒక మాట మాట్లాడితే సీఎం సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి బుధవారం కర్నూలు న్యాయరాజధాని ఉంటుందని, హైకోర్టు కర్నూలులో పెడతామని, మూడురాజధానులకు కట్టుబడ ఉన్నామని చెప్పడంపై గందరగోళం పరిస్థితులు ఏర్పడ్డాయి. కర్నూలులో న్యాయరాజధాని ఏర్పాటు చేస్తామని హైకోర్టు వస్తుందని సీఎం జగన్‌ అధికారంలో వచ్చిన తరువాత ప్రకటించారు. అయితే స్థానిక ప్రజలు మాత్రం పరిశ్రమలు లేక, కరువుతో పంటలు పండక ఇబ్బందులు పడుతున్నారు. ఉపాధి కల్పన కోసం పరిశ్రమలు ఏర్పాటు చేయాలని, వేదవతి, గుండ్రేవుల, సిద్దేశ్వరం లాంటి ఇరిగేషన్‌ ప్రాజెక్టు పూర్తి చేయడం వల్లే జిల్లా అభివృద్ది జరుగుతుందని చెబుతున్నారు. ప్రభుత్వం ఇలాంటివి ఏమాత్రం పట్టించుకోకుండా హైకోర్టు ఏర్పాటు చేస్తామని రాయలసీమ గర్జన ఏర్పాటుచేసి ప్రకటించారు. కానీ హైకోర్టు ఏర్పాటుకు సంబంధించి ఎక్కడ చిన్న పని కూడా ప్రారంభించలేదు. మూడున్నరేళ్లు గడుస్తున్నా ప్రభుత్వం ప్రకటనలకు మాత్రమే పరిమితం అయింది తప్పా ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేదు. ఎన్నికలు మరో ఏడాది సమయం ఉండటంతో హైకోర్టు పనులు ప్రారంభించకుంటే మాత్రం వైసీపీ నేతలకు జిల్లాలో ఇబ్బందికర పరిస్థితులు తప్పవు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img