Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

కాంగ్రెస్‌కు మద్దతిస్తాం

. ఆ పార్టీ కూడా ఇతరులకు మద్దతివ్వాలి
. ప్రతిపక్ష ఐక్యతపై మమత

కోల్‌కతా: ప్రతిపక్షాల ఐక్యతపై పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి, తృణమూల్‌ కాంగ్రెస్‌ (టీఎంసీ) అధినేత్రి మమతా బెనర్జీ సోమవారం మొదటిసారిగా నోరువిప్పారు. వచ్చే ఏడాది జరుగనున్న పార్లమెంట్‌ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీకి మద్దతిస్తామని చెప్పారు. ఆ పార్టీ కూడా మిగతా ప్రతిపక్ష పార్టీలకు మద్దతు ఇవ్వాలని షరతుపెట్టారు. ఆ రాష్ట్ర సచివాలయంలో మమత మీడియాతో మాట్లాడుతూ, ‘కాంగ్రెస్‌ బలంగా ఉన్న చోట, వారిని పోరాడనివ్వండి. మేం వారికి (కాంగ్రెస్‌కు) మద్దతు ఇస్తాం. అందులో తప్పు లేదు. అయితే ఇతర రాజకీయ పార్టీలకు కూడా వారు (కాంగ్రెస్‌) మద్దతు ఇవ్వాలి’ అని ఆమె అన్నారు. కాంగ్రెస్‌కు మద్దతు కావాలంటే ఆ పార్టీ కూడా ఇతర పార్టీలకు మద్దతు ఇవ్వాలని స్పష్టం చేశారు. లోక్‌సభ ఎన్నికల్లో సీట్ల పంపకం గురించి కూడా మమతా బెనర్జీ మాట్లాడారు. ప్రాంతీయ పార్టీల హవా ఉన్న చోట వాటికే సీట్లు కేటాయించాలని అన్నారు. బలమైన ప్రాంతీయ పార్టీలకు ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. బీజేపీని అధికారం నుంచి దించిన కర్ణాటక ప్రజలకు తొలుత ఆమె అభివాదం చేశారు. అయితే అక్కడ గెలిచిన కాంగ్రెస్‌ పార్టీ గురించి ఈ సందర్భంగా ఎలాంటి ప్రస్తావన చేయలేదు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img