Wednesday, April 24, 2024
Wednesday, April 24, 2024

కాంగ్రెస్‌ వల్లే అభివృద్ధి నత్తనడక

ఉత్తరాఖండ్‌లో ప్రధాని మోదీ విమర్శ
హల్ద్వానీ/డెహ్రాడూన్‌ : అభివృద్ధి ప్రాజెక్టులు దశాబ్దాల పాటు నత్తనడక నడవడానికి కేంద్రంలోనూ, ఉత్తరాఖండ్‌లోనూ గల కాంగ్రెస్‌ ప్రభుత్వాలే కారణమని ప్రధాని నరేంద్రమోదీ ఆరోపించారు. ఫలితంగా ఉత్తరాఖండ్‌లోని అనేక గ్రామాల నుంచి ప్రజలు వలస వెళ్లాల్సి వచ్చిందని చెప్పారు. హల్ద్వానీలో గురువారం ప్రధాని ఓ ర్యాలీలో ప్రసంగిస్తూ ఉత్తరాఖండ్‌ను పాలించిన గత కాంగ్రెస్‌ ప్రభుత్వాలు రాష్ట్రాన్ని దోచుకోవడంపైనా దృష్టి పెటాయని ఆరోపించారు. రాష్ట్ర అభివృద్ధికి ఎలాంటి ప్రయత్నం చేయలేదని మండిపడ్డారు. రూ.5,747 కోట్ల లఖ్వార్‌ జల విద్యుత్‌ ప్రాజెక్టు సహా రూ.17,500 కోట్ల విలువైన ప్రాజెక్టులకు ప్రధాని మోదీ ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. లఖ్వార్‌ ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించి 1974లోనే ప్రతిపాదనలు వచ్చాయని, అది వెలుగులోకి రావడానికి 46 ఏళ్లు పట్టిందని ప్రధాని అన్నారు. ఈ ప్రాజెక్టు జాప్యానికి నాటి పాలకులు కారణం కాదా అని నిలదీశారు. వారు చేసిన పాపాన్ని మర్చిపోగలమా అని ప్రశ్నించారు. రోడ్లు, ఇతర మౌలిక సదుపాయాలు లేని కారణంగా ఉత్తరాఖండ్‌ గ్రామీణులు తరతరాలుగా ఇతర ప్రాంతాలకు వలస వెళ్లాల్సిన దుస్థితి ఏర్పడిరదని చెప్పారు. లఖ్వార్‌ ప్రాజెక్టును సకాలంలో పూర్తి చేసి ఉంటే విద్యుత్‌, నీటిపారుదల, తాగునీటి సమస్య పరిష్కారమయ్యేదని తెలిపారు. కాంగ్రెస్‌ ప్రభుత్వాల హయాంలో రాష్ట్రంలో అభివృద్ధి శూన్యమని ఆరోపించారు. కాంగ్రెస్‌ నేత హరీశ్‌ రావత్‌పై మోదీ విమర్శలు గుప్పించారు. 2016లో రెబల్‌ ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడానికి హరీశ్‌ రావత్‌ డబ్బులు ఎరచూపిన వీడియోలను ప్రధాని ప్రస్తావించారు. తాము చెప్పిన మాట ప్రకారం అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశామన్నారు వీటిని సకాలంలో పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. ‘ఉత్తరాఖండ్‌ అభివృద్ధికి నేను మనస్పూర్తిగా పనిచేస్తున్నాను’ అని మొదీ చెప్పుకొచ్చారు. రూ.3,420 కోట్ల విలువైన ఆరు ప్రాజెక్టులను మోదీ ప్రారంభించారు. వీటితో పాటు రూ.14,127 కోట్ల విలువైన 17 ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img