Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

కాకినాడలో వీఓఏల ఆందోళన

సమస్యలు పరిష్కరించాలని డిమాండ్‌
మంత్రుల సమావేశం ముట్టడికి యత్నం

రాష్ట్ర ప్రభుత్వం దురుద్దేశంతో వీఓఏల కాలపరిమితి సర్క్యులర్‌ విడుదల చేసిందని, దీనిని వెంటనే రద్దు చేయాలని, గ్రేడిరగ్‌ పేరుతో వేతనాల్లో కోత విధింపును ఆపాలని డిమాండ్‌ చేస్తూ ఆంధ్రప్రదేశ్‌ యానిమేటర్ల సంఘం (ఏఐటీయూసీ అనుబంధం) తూర్పుగోదావరి జిల్లా కమిటీ అధ్వర్యంలో వందలాది మంది వీఓఏలు జిల్లాపరిషత్‌ సమావేశ మందిరాన్ని బుధవారం ముట్టడిరచారు. డీఎస్పీ అధ్వర్యంలో పోలీసులు రంగంలోకి దిగి ఆందోళనకారులను అడ్డుకున్నారు. కొద్దిసేపు ఆందోళనకారులకు, పోలీసులకు తోపులాట జరిగింది. ఆందోళనకారులను కార్యాలయంలోకి వెళ్లకుండా అడ్డుకున్నారు. వీఓఏలు రోడ్డుపై బైఠాయించారు. డీఆర్‌ఓ సత్తిబాబు, డీఆర్డీఏ పీడీ హరిహరనాథ్‌లు వీవోఏలతో చర్చలు జరిపారు. మంత్రులు బయటకు రాకుండా వెళ్లేది లేదని వీవోఏలు భీష్మించుకున్నారు. సమావేశం అనంతరం ఆందోళనకారులతో మంత్రుల భేటీకి డీఎస్పీ, సీఐ చొరవతీసుకున్నారు. అనంతరం యానిమేటర్ల సంఘం గౌరవ అధ్యక్షులు, ఏఐటీయూసీ జిల్లా ఉపాధ్యక్షులు తాటిపాక మధు మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌ రెడ్డి వీవోఏలకు వేతనాలు ఇచ్చి గ్రేడిరగ్‌ పేరుతో తగ్గించడం దారుణమన్నారు. సెప్టెంబరులో వీఓఏల తొలగింపునకు కుట్ర చేస్తున్నారని విమర్శించారు. యూనియన్‌ అధ్యక్ష, కార్యదర్శులు కె.గంగాభవాని, ఎం శ్రీదేవి మాట్లాడుతూ ప్రభుత్వం ప్రకటించిన 10 వేల వేతనాలకుగాను ఎనిమిది వేలు మాత్రమే ప్రభుత్వం చెల్లిస్తుందని, మిగతా రూ.2000 గ్రామ సంఘాల నుంచి చెల్లింపులు జరగడం లేదని విమర్శించారు. యానిమేటర్లకు కాలపరిమితి విధిస్తూ ప్రభుత్వం సర్క్యులర్‌ జారీ చేయడం సరైంది కాదన్నారు. ప్రభుత్వం వెనక్కి తగ్గకపోతే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామన్నారు. ఏఐటీయూసీ జిల్లా నాయకులు నక్క కిషోర్‌, టి అన్నవరం, లోవరత్నం, ఎస్‌ కోటిరాజు, సంఘం నాయకులు కె.రత్నకుమారి, వరలక్ష్మి, పాము వెంకటలక్ష్మి, గుమ్మడి నాగజ్యోతి, పరమేశ్వరి, దుర్గ, సునీత, అమ్మని సుగుణ, కుసుమ, మహాలక్ష్మి, పివీ మంగాదేవి నాయకత్వం వహించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img