Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

కార్మిక నేత వి వి. రామారావు కన్నుమూత

కార్మికవర్గ ఆశాజ్యోతి ఏ ఐ టి యు సి జాతీయ ఉపాధ్యక్షులు కామ్రేడ్ వి వి రామారావు గారు కొద్దిసేపటి క్రితం విశాఖపట్నం సెవెన్ హిల్స్ హాస్పిటల్ లో తుది శ్వాస విడిచారు. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో హాస్పిటల్ లో చికిత్స పొందుతూ ఆదివారం మరణించిన ఏఐటీయూసీ జాతీయ ఉపాధ్యక్షుడు, కమ్యూనిస్టు పార్టీ నాయకుడు కామ్రేడ్ వి వి రామారావు (74) కి భార్య, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. కృష్ణాజిల్లా చిట్టి గూడూరు గ్రామములో వేమూరి వెంకట కృష్ణయ్య, సంపూర్ణ మ్మ ల దంపతులకు 1947 అక్టోబర్‌ 7 న జన్మించిన వేమూరి వెంకట రామారావు (వి వి రామారావు) విద్యార్థి దశలోనే కమ్యూనిస్టు భావజాలం వైపు ఆకర్షితులై విశాఖ జిల్లాలో కార్మిక ఉద్యమ నిర్మాణంలో ప్రముఖ పాత్ర పోషించి జాతీయ స్థాయి నాయకుడిగా ఎదిగారు. కామ్రేడ్ వి వి ఆర్ విశాఖాట్టణం హార్బర్ &పోర్టు వర్కర్స్ యూనియన్ గౌరవాధ్యక్షుడుగా, సీపీఐ విశాఖ జిల్లా కార్యదర్శిగా, ఉమ్మడి రాష్ట్రంలో పార్టీ కార్యదర్శివర్గ కార్యవర్గ సబ్యుడిగా, జాతీయ సమితి సబ్యుడిగా వివిద బాద్యతల నిర్వహించారని, కామ్రేడ్ రామారావు గారి ఆరోగ్యం బాగోలేదని తెలిసిన వెంటనే సీపీఐ జాతీయ కార్యదర్శి కామ్రేడ్ కె నారాయణ, జె వి సత్యనారాయణ మూర్తి జులై నెల 9 వ తేదీన, తిరిగి 29 వ తేదీన కె నారాయణ, రాష్ట్ర ఏఐటీయూసీ అధ్యక్ష ప్రధాన కార్యదర్సులు ఆర్ రవీంద్రనాథ్, జి ఓబులేసు హాస్పిటల్ కు వెళ్లి ఆరోగ్య పరిస్థితి వాకబు చేసి కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పి వెళ్లారు. సీపీఐ రాష్ట్ర సమితి తరపున ప్రగాఢ సంతాపం ప్రకటించి వారి కుటుంబ సభ్యులకు సానుభూతిని తెలిపారు.

కామ్రేడ్ రామారావు మృతికి సంతాపాన్ని తెలిపిన వారిలో సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కార్పొరేటర్ ఎ జె స్టాలిన్, విశాఖపట్నం కో అపరేటివ్ బ్యాంక్ అధ్యక్షులు చలసాని రాఘవేంద్రరావు, సీపీఐ జిల్లా నగర కార్యదర్సులు బాలేపల్లి వెంకటరమణ, ఎం పైడిరాజు, జిల్లా ఏఐటీయూసీ ప్రధాన కార్యదర్శి, విశాఖపట్నం హార్బర్ & పోర్టు వర్కర్స్ యూనియన్ ప్రధాన కార్యదర్శి బి సీహెచ్ మసేన్ లతో పాటు పలువురు సీపీఐ ప్రజాసంఘాలు నాయకులు సంతాపాన్ని తెలిపారు.
సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ మాట్లాడుతూ సిపిఐ జాతీయ సమితి మాజీ సభ్యులు ఎఐటీయుసి నేత వివి రామారావు మరణం పట్ల ప్రగాఢ సంతాపం తెలిపారు. వి.వి. రామారావు కార్మికుల పక్షపాతిగా అనేక కార్మిక ఉద్యమాల్లో ముఖ్య భూమిక పోషించారని, అనేక ఉద్యమాలకు నేతృత్వం వహించిన రామారావు మరణం కమ్యూనిస్టు ఉద్యమానికి తీరని లోటని ఆయన మరణం పట్ల ప్రగాఢ సంతాపాన్ని, కుటుంబ సభ్యులకు సానుభూతిని తెలియచేసారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img