Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

కీలక వడ్డీరేట్లు యథాతథం

ద్వైమాసిక ద్రవ్య పరపతి విధాన సమీక్ష విధాన సమీక్ష నిర్ణయాలను గవర్నర్‌ శక్తికాంత్‌ దాస్‌ బు రెపో రేటును 4 శాతం వద్దే ఉంచాలని మానిటరీ పాలసీ కమిటీ నిర్ణయించినట్లు ఆయన వెల్లడిరచారు. రివర్స్‌ రెపో రేటును 3.35 శాతంగా ఉంచామని ఆయన తెలిపారు. మార్జినల్‌ స్టాండిరగ్‌ ఫెసిలిటీ రేటు 4.25 శాతంగానే ఉండనుంది. అక్టోబరులో జరిగిన సమావేశంలోనూ వడ్డీ రేట్లలో ఎలాంటి మార్పు చేయలేదు. ఇలా రేట్లను యథాతథంగా కొనసాగించడం వరుసగా ఇది తొమ్మిదోసారి. భారత ఆర్థిక వ్యవస్థ కోలుకుంటోందని, కోవిడ్‌ సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉందని శక్తికాంత్‌ దాస్‌ అన్నారు. పెట్రోల్‌, డీజిల్‌పై పన్ను తగ్గింపు వల్ల.. వాటి డిమాండ్‌ పెరుగుతుందని అన్నారు. 2022 వార్షిక సంవత్సరానికి జీడీపీ వృద్ధి రేటు టార్గెట్‌ 9.5 శాతంగా ఉన్నట్లు ఆర్బీఐ గవర్నర్‌ తెలిపారు. పెట్రోల్‌, డీజిల్‌పై ఎక్సైజ్‌ సుంకాన్ని తగ్గించడం వల్ల ద్రవ్యోల్బణం అదుపులోకి వస్తుందన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img