Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

కృష్ణా, గోదావరి నదీ బోర్డుల సమావేశానికి తెలంగాణ మళ్లీ గైర్హాజర్‌

వివరాల సమర్పణకు వారం గడువు కోరిన ఏపీ

అమరావతి : కృష్ణా, గోదావరి నదీ యాజమాన్య బోర్డుల సంయుక్త సమావేశానికి తెలంగాణా అధికారులు మరోసారి గైర్హాజరయ్యారు. సోమవారం హైదరాబాద్‌ జలసౌధలో కేఆర్‌ఎంబీ, జీఆర్‌ఎంబీల సంయుక్త సమావేశం జరిగింది. కేంద్రం విడుదల చేసిన గెజిట్‌ నోటిఫికేషన్‌లోని అంశాల అమలుపై చర్చించారు. ఈ సమావేశానికి ఏపీ ఇరిగేషన్‌ అధికారులు హాజరు కాగా, తెలంగాణ అధికారులు మరోసారి గైర్హాజర య్యారు. జలసౌధలో నిర్వహించిన సమావేశంలో ఏపీ అధికారులు తమ వాదనలు వినిపించారు. గెజిట్‌ నోటిఫికేషన్‌లోని అభ్యంతరాలను కేంద్రం దృష్టికి తీసుకెళ్తామని తెలిపారు. అభ్యంతరాలు లేని ప్రాజెక్టు వివరాలు ఇవ్వడానికి అభ్యంతరం లేదని, అయితే పూర్తి వివరాల సమర్పణకు వారం గడువు కావాలని

కోరింది. ఈ మేరకు బోర్డుల చైర్మన్లు స్పందిస్తూ, బోర్డులు అడిగిన సమాచారం సాధ్యమైనంత త్వరగా ఇవ్వాలని కోరారు. నెలలో గెజిట్‌ అమలు, కార్యాచరణ పూర్తయ్యే అవకాశం లేదని, దీనిపై కేంద్ర జలశక్తి శాఖకు నివేదిస్తామని పేర్కొన్నారు. ప్రాజెక్టుల వద్ద సీఐఎస్‌ఎఫ్‌ భద్రతపై కేంద్రంతో చర్చిస్తున్నామని జీఆర్‌ఎంబీ, కేఆర్‌ఎంబీ వెల్లడిరచాయి. సమావేశం అనంతరం ఏపీ ఇరిగేషన్‌ కార్యదర్శి శ్యామలరావు మాట్లాడుతూ కేంద్ర గెజిట్‌ నోటిఫికేషన్‌ను స్వాగతిస్తున్నామని తెలిపారు. కేఆర్‌ఎంబీ, జీఆర్‌ఎంబీ బోర్డు సమావేశంలో అధికారుల నియామకం, సదుపాయాల కల్పనపై చర్చించామన్నారు.
అయితే కేంద్ర ప్రభుత్వం వెల్లడిరచిన గెజిట్‌లో కొన్ని మార్పులు కోరుతున్నామని, ముఖ్యంగా షెడ్యూల్‌ 1,2,3లో మార్పులు చేయాల్సి ఉందన్నారు. కేంద్ర ప్రభుత్వ నిర్ణయం ప్రకారం అక్టోబర్‌ 14 నుంచి గెజిట్‌ అమలుకు సహకరిస్తామని అన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img