Wednesday, April 24, 2024
Wednesday, April 24, 2024

కేంద్రీయ విద్యాలయాల్లో ఎంపీ కోటా ఎత్తేస్తారా ?

న్యూదిల్లీ: కేంద్రీయ విద్యాలయాల్లో ఎంపీల కోటాను ఎత్తివేయాలా? అనే అంశంపై కేంద్ర ప్రభుత్వం రాజకీయ పార్టీలతో చర్చించనున్నది. ఎంపీల కోటా కింద ఈ విద్యాలయాల్లో 10 సీట్లను కేటాయిస్తున్నారు. ఎంపీలు లెటర్‌ జారీ చేసిన 10 మంది విద్యార్థులకు స్కూళ్లలో సీట్లు కల్పిస్తున్నారు. అయితే ఇప్పుడు ఆ కోటాను ఎత్తివేయాలని కొందరు, లేదు ఆ కోటాను పెంచాలని కొందరు కోరుతున్నారు. ఈ నేపథ్యంలో ఆ అంశాన్ని రాజకీయ పార్టీలతో కలిసి చర్చించనున్నట్లు కేంద్ర ప్రభుత్వం చెప్పింది. లోక్‌సభలో ఈ అంశంపై సోమవారం చర్చించారు. దీనిపై రాజకీయ పార్టీలతో చర్చ నిర్వహించాలని విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రదాన్‌ను స్పీకర్‌ ఓం బిర్లా ఆదేశించారు. కోటాలో ఎందుకు వివక్ష ఉండాలని స్పీకర్‌ అన్నారు. కేంద్ర స్కూళ్లలో 10 సీట్ల కోటా సరిపోదు అని, దాన్ని పెంచండి లేదంటే రద్దు చేయాలని కాంగ్రెస్‌ ఎంపీ మనీష్‌ తివారీ డిమాండ్‌ చేశారు. అయితే ఎంపీల కోటాను రద్దు చేయాలని సభ ఏకగ్రీవంగా నిర్ణయిస్తే ప్రభుత్వం ఆ దిశగా చర్యలు తీసుకుంటుందని మంత్రి ప్రధాన్‌ అన్నారు. మొదట్లో ఈ కోటా రెండనీ, తరువాత ఐదుకు పెంచారనీ, ప్రస్తుతం పది ఉందనీ, దీనిని కూడా పెంచాలని కొందరు సభ్యులు కోరుతున్నారని చెప్పారు. మనం ప్రజలకు ప్రతినిధులమని, కొందరి కోసం కాదన్నారు. మంత్రి నిర్ణయాన్ని కొందరు ఎంపీలు వ్యతిరేకించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img