Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

కేంద్ర పథకాలు వల్లెవేసిన మోదీ.. ఏపీకిచ్చిన హామీలపై మౌనం.. ఏం చెప్పారంటే ?

ప్రియమైన సోదరీ సోదరులారా నమస్కారం అంటూ ప్రధాని మోడీ తన ప్రసంగం మొదలుపెట్టారు. సభికులకు అభివాదం చేశాక మోదీ తన ప్రసంగం ప్రారంభించారు. అల్లూరి సీతారామరాజు 125వ జయంతి సందర్భంగా ఏపీకి వచ్చి మిమ్మల్ని కలిసే అవకాశం వచ్చిందని మోదీ తెలిపారు. దాదాపు అరగంటసేపు సాగిన ప్రధాని ప్రసంగంలో జాతీయ అంశాలు, ఆర్థ్ధిక వ్యవస్ధ, అభివృద్ధి, కేంద్ర పథకాల పైనే ప్రస్తావించారు. ఏపీకిచ్చిన హామీల ప్రస్తావన కానీ, కొత్తగా ఇచ్చిన హామీలు కానీ లేవు. ప్రధాని మోదీ ప్రసంగం విశాఖ ఓ ప్రత్యేక నగరమని,వ్యాపార కేంద్రమైన నగరమని ప్రధాని మోడీ తన ప్రసంగంలో తెలిపారు. వేల ఏళ్ల క్రితమే విశాఖ పోర్టు నుంచి పశ్చిమాసియా నుంచి రోమ్‌ వరకూ వ్యాపారం సాగేదని, ఇవాళ కూడా విశాఖపట్నం భారత వ్యాపార కేంద్రబిందువుగా ఉందన్నారు. పదివేల కోట్లకుపైగా విలువైన ప్రాజెక్టులు ఏపీలోని విశాఖ ఆకాంక్షలు తీర్చేందుకు ఉపయోగిస్తున్నామన్నారు. మౌలిక సౌకర్యాల నుంచి ప్రారంభించి, ఈజ్‌ ఆఫ్‌ లివింగ్‌, ఆత్మ నిర్భర్‌ భారత్‌ వరకూ అభివృద్ధికి ఉపయోగపడతాయన్నారు. కాబట్టి వీటి వల్ల ఏపీ ప్రజలకు ఎంతో మేలు జరుగుతుందన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img