Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

కొత్త కేసులు పదివేలకు దిగువనే..కానీ వణికిస్తోన్న ఒమిక్రాన్‌

దేశంలో కరోనా కొత్త కేసులు పదివేలకు దిగువనే నమోదవుతున్నాయి. దేశంలో గడిచిన 24 గంటల్లో 8306 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3,46,41,561కు చేరింది. ఇందులో 3,40,69,608 మంది కరోనా నుంచి కోలుకున్నారు. మహమ్మారి వల్ల 4,73,537 మంది మృతిచెందారు. మరో 98,416 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. గత 552 రోజుల్లో ఇది కనిష్టమని కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది. కాగా, గత 24 గంటల్లో 211 మంది మరణించగా, 8834 మంది కరోనా నుంచి కోలుకున్నారని వెల్లడిరచింది.
దేశంలో కరోనా కేసులు తక్కువగా నమోదవ్వడం..కాస్త ఊరటనిస్తున్నా..కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్‌ కలవరపెడుతోంది. ఇప్పటివరకు ఆ వేరియంట్‌కు చెందిన 21 కేసులు వెలుగుచూశాయి. వచ్చే రెండు నెలల్లో స్వల్పస్థాయిలో థర్డ్‌వేవ్‌ వచ్చే అవకాశం ఉందని నిపుణలు అంచనా వేస్తున్నారు. ఈ క్రమంలో ప్రజలు కొవిడ్‌ నిబంధనల విషయంలో ఏమాత్రం అలసత్వం ప్రదర్శిచవద్దని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు హెచ్చరిస్తున్నాయి.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img