Friday, April 26, 2024
Friday, April 26, 2024

కొత్త వేరియంట్‌పై ప్రభుత్వం దృష్టి

కేంద్ర ఆరోగ్యశాఖ మన్సుఖ్‌ మాండవీయ

దేశంలో కరోనా కొత్త వేరియంట్‌ కలవరపెడుతోంది. మధ్యప్రదేశ్‌, మహారాష్ట్రలో పలువురికి కరోనా కొత్త వేరియంట్‌ ఏవై.4 సోకినట్లు తేలింది. ఈ క్రమంలో కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్సుఖ్‌ మాండవీయ దీనిపై మాట్లాడుతూ, వేరియంట్‌ అంశం ప్రభుత్వం దృష్టిలో ఉందని, ప్రతి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు. ఇండియన్‌ కౌన్సిల్‌ ఫర్‌ మెడికల్‌ రీసెర్చ్‌ నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ డిసీజ్‌ కంట్రోల్‌ బృందాలు అధ్యయనం చేస్తాయని చెప్పారు. ఇక కొవాగ్జిన్‌ టీకాకు డబ్ల్యూహెచ్‌ ఆమోదంపై స్పందిస్తూ.. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రత్యేక వ్యవస్థను కలిగి ఉందని, నేటి సమావేశంలో సాంకేతిక కమిటీ నిర్ణయం ఆధారంగా కొవాగ్జిన్‌కు గుర్తింపు ఆధారపడి ఉంటుందన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img